సైరస్‌ మిస్త్రీ విషాదం: పోస్ట్‌మార్టం నివేదిక ఏం చెబుతోందంటే? | Cyrus Mistry Had Head Heart Injuries Says Initial Autopsy | Sakshi
Sakshi News home page

Cyrus Mistry: విషాదం, పోస్ట్‌మార్టం నివేదిక ఏం చెబుతోందంటే?

Sep 6 2022 3:09 PM | Updated on Sep 6 2022 3:40 PM

Cyrus Mistry Had Head Heart Injuries Says Initial Autopsy - Sakshi

ముంబై: గత ఆదివారం కారు ప్రమాదంలో మరణించిన  టాటాసన్స్‌  మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ ప్రాథిమిక పోస్ట్‌మార్టం పూర్తియింది. దీని ప్రకారం ఆయన తలకు, గుండెకు తీవ్ర గాయాలయ్యాయి. ఫలితంగా అంతర్గత రక్తస్రావంతో అక్కడి కక్కడే మరణించినట్లు నివేదిక పేర్కొంది. అలాగే పాలీట్రామా (శరీరంలోని అంతర్గత అవయవాలు తీవ్రంగా  దెబ్బ తినడం)కు గురయ్యారని ఈ నివేదిక తేల్చింది.(Instagram: భారీ జరిమానా..షాకింగ్‌! ఎందుకో తెలుసా?)

సోమవారం తెల్లవారుజామున ముంబైలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని జేజే ఆసుపత్రిలో సైరస్ మిస్త్రీ పోస్టుమార్టం నిర్వహించినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. మిస్త్రీ, జహంగీర్ పండోలే ఇద్దరి శవపరీక్ష నివేదికను కాసా పోలీస్ స్టేషన్‌కు (ప్రమాదం జరిగిన ప్రాంతం)పంపారు. మరో రెండురోజుల్లో తుది నివేదిక వెలువడ నుంది. ఇందులో  మిస్త్రీ మరణానికి ఖచ్చితమైన కారణాన్ని పేర్కొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మిస్త్రీ శరీరంనుంచి ఎనిమిది శాంపిళ్లను సేకరించి, తదుపరి పరిశీలన కోసం విసెరా నమూనాలు భద్రం చేశారు. మరోవైపు  మంగళవారం తెల్లవారుజామున ముంబైలోని వర్లీ శ్మశానవాటికలో సైరస్‌ మిస్త్రీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై సూర్య నదిపై ఉన్న వంతెనపై వేగంగా వెళుతున్న మెర్సిడెస్‌ బెంజ్‌ కారు  ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మిస్త్రీతోపాటు, స్నేహితుడు జహంగీర్ పండోలే మరణించారు. తీవ్రంగా గాయపడ్డ డాక్టర్‌ అనాహిత పండోలే, ఆమె భర్త డేరియస్‌ పండోలే ముంబైలోని రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మితిమీరిన వేగం మిస్త్రీ , మిస్టర్ జహంగీర్ పండోల్ ఇద్దరూ సీట్ బెల్ట్ ధరించకపోవడమే విషాదానికి దారి తీసిందని పోలీసులుఅధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: New milestone: వావ్‌.. మార్కెట్లో భారీగా ఇన్వెస్టర్లు, కీలక మైలురాయి

ముగిసిన అంత్యక్రియలు 
జేజే ఆస్పత్రి నుంచి తీసుకొచ్చిన ఆయన భౌతికకాయాన్నిస్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషుల నివాళులర్పించేందుకు  వర్లీ శ్మశానవాటికలో ఉంచారు. అనంతరం సెంట్రల్ ముంబైలోని వర్లీలోని ఎలక్ట్రిక్ శ్మశానవాటికలో హిందూ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు జరిపించారు. పార్సీ సంఘం సభ్యులు, వ్యాపార ప్రముఖులు, రాజకీయ నాయకులు దహన సంస్కారాలకు హాజరయ్యారు. సైరస్ మిస్త్రీ సోదరుడు షాపూర్ మిస్త్రీ, మామ, సీనియర్ న్యాయవాది ఇక్బాల్ చాగ్లా, పారిశ్రామికవేత్తలు అనిల్ అంబానీ, అజిత్ గులాబ్‌చంద్, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తదితరులు సైరస్‌ మిస్త్రీకి తుది నివాళులర్పించారు.

అమూల్‌ ప్రత్యేక నివాళి
డైనమిక్‌ బిజినెస్‌మ్యాన్‌ అంటూ అమూల్‌ ఇండియా మిస్త్రీకి నివాళులర్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement