నెలవారీ 10కోట్ల యూజర్లను సంపాదించిన సంస్థ!

Company That Has Acquired 10 Crore Monthly Users - Sakshi

మెటా సంస్థలో భాగంగా ఉన్న ఇన్‌స్టాగ్రామ్ థ్రెడ్స్‌ నెలవారీగా దాదాపు 100 మిలియన్ల(10కోట్లు) వినియోగదారులను చేరుకున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఇటీవల కంపెనీ త్రైమాసిక ఆదాయాల గురించి మాట్లాడుతున్నపుడు ఈ విషయాన్ని చెప్పారు. సానుకూలంగా సంభాషణలు సాగించేందుకు చేసే ప్రయత్నంలో భాగంగా కంపెనీ ఈ టూల్‌ను తీసుకొచ్చిందన్నారు.  

ఇన్‌స్టాథ్రెడ్‌లు రానున్న రోజుల్లో మరింత వేగంగా ప్రజల్లోకి వెళ్తాయని మెటా సీఎఫ్‌ఓ సుసాన్ లి అన్నారు. ఇన్‌స్టాగ్రామ్ వార్తలకు వ్యతిరేకం కాదని, సంబంధిత ప్లాట్‌ఫామ్‌లో థ్రెడ్‌లు వార్తలను విస్తరించట్లేదని ఇన్‌స్టా ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే ఎక్స్‌(ట్విటర​్‌)కు పోటీగా మెటా ఇన్‌స్టాథ్రెడ్‌లను జులైలో ప్రారంభించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top