స్టార్టప్‌ ర్యాంకులు: కమింగ్‌ సూన్‌

Commerce And Industry Ministry To Release States Startup Ranking july 4 - Sakshi

జూలై 4న స్టార్టప్‌ ర్యాంకుల ప్రకటన - కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

సాక్షి, న్యూఢిల్లీ: స్టార్టప్‌ వ్యవస్థకు దన్నుగా నిబంధనల వాతావరణాన్ని సులభతరం చేసే బాటలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ర్యాంకింగ్స్‌ విడుదల చేయనుంది. ఈ ఏడాది 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌లో రాష్ట్రాలవారీగా సోమవారం(4న) ర్యాంకులను ప్రకటించ నుంది.

ఇది మూడో ఎడిషన్‌ కాగా.. అంతక్రితం 2020 సెప్టెంబర్‌లో ర్యాంకులను ప్రకటించింది. గుజరాత్‌ టాప్‌ ర్యాంకులో నిలిచిన సంగతి తెలిసిందే. వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌.. స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌కు అండగా నిలిచిన రాష్ట్రాలు, ప్రాంతాలవారీగా ర్యాంకులను విడుదల చేయనున్నారు. పోటీ, సహకార సమాఖ్య విధానాల ద్వారా దేశీ విజన్‌ను ప్రోత్సహించేందుకు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) ర్యాంకింగ్‌ను చేపట్టింది. స్టార్టప్‌ల వృద్ధికి అనుగుణంగా సరళతర నియంత్రణల అమలుతోపాటు వ్యవస్థ పటిష్టతకు మద్దతుగా నిలిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో తొలుత 2018లో ర్యాంకింగ్‌ విధానానికి తెరతీసింది.  

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top