హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పారిశ్రామిక వ్యర్ధాల నిర్వహణ సంబంధ సేవలు అందించే క్లీన్ హార్బర్స్ రాబోయే రోజుల్లో 1,000 మందిని పైగా రిక్రూట్ చేసుకోనుంది. వచ్చే ఏడాదిన్నర కాలంలోనే కొత్తగా 300 మందిని నియమించుకోనుండగా.. ఇందులో ఎక్కువ భాగం హైరింగ్ హైదరాబాద్ కార్యాలయం కోసం ఉండనుంది. సోమవారం హైదరాబాద్‌లోని తమ కార్యాలయ విస్తరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంస్థ సీఈవో అలాన్ మెకిమ్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రెసిడెంట్ అవినాష్ సమ్రిత్ ఈ విషయాలు తెలిపారు.
హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, పుణెల్లో కార్యాలయాలు ఉన్నట్లు అవినాష్ చెప్పారు. ప్రస్తుతం క్లీన్ హార్బర్స్‌కు దేశీయంగా 1,200 మంది సిబ్బంది ఉండగా.. హైదరాబాద్‌లో 850 మంది ఉన్నారు. కొత్త కార్యాలయంపై దాదాపు రూ. 10 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు అవినాష్ చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో తమ టర్నోవరు దాదాపు రూ. 150–రూ. 200 కోట్ల స్థాయిలో ఉన్నట్లు వివరించారు. 5 బిలియన్ డాలర్లుగా ఉన్న క్లీన్ హార్బర్స్ వచ్చే అయిదేళ్లలో 7 బిలియన్ పైగా డాలర్ల కంపెనీగా ఎదిగే క్రమంలో తమ వ్యాపారానికి అనువైన సంస్థల కొనుగోలు, విలీనాల యోచన కూడా ఉన్నట్లు మెకిన్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment