Classic Legends To Launch Yezdi Motorcycles In India, Check Details Inside - Sakshi
Sakshi News home page

Yezdi Motorcycles: రెట్రో బైక్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌..! సరికొత్తగా రాబోతున్న యెజ్దీ బైక్‌..! లాంచ్‌ ఎప్పుడంటే..!

Dec 26 2021 11:32 AM | Updated on Dec 26 2021 1:36 PM

Classic Legends Announces Ressurection Date For Yezdi Motorcycles - Sakshi

Classic Legends Announces Ressurection Date For Yezdi Motorcycles: జావా మోటార్‌ సైకిల్స్‌, బీఎస్‌ఏ క్లాసిక్‌ లెజెండ్స్‌ తరువాత భారత్‌లోకి మరో రెట్రో బైక్‌ మార్కెట్లలోకి రానుంది. రెట్రో బైక్స్‌లో యెజ్దీ బైక్లకు ఉండే క్రేజే వేరు. యెజ్దీ రయ్‌ రయ్‌మంటూ చేసే సౌండ్‌ బైక్‌ లవర్స్‌ను ఇట్టే కట్టిపడేస్తుంది. ట్విన్‌ సైలెన్సర్‌ బైక్లను యెజ్దీ రూపొందించింది. భారత్‌లో యెజ్దీ బై​క్స్‌ మరోసారి కనువిందు చేయనున్నాయి.  యెజ్డిస్ భారతీయ మోటర్‌స్పోర్ట్ రంగంలో కూడా బలమైన ఖ్యాతిని కలిగి ఉంది. 1980-1990లలో వీపరితమైన క్రేజ్‌ను యెజ్దీ రోడ్‌ కింగ్‌ బైక్లకు వచ్చింది. 


 

మహీంద్రా గ్రూప్‌తో పునరాగమనం..!
భారత మార్కెట్లలోకి తొలుత జావా మోటార్స్‌ యెజ్దీ బైక్లను లాంచ్‌ చేయాలని భావించింది. అది కాస్త వీలు కాకపోవడంతో మహీంద్రా గ్రూప్‌కు చెందిన క్లాసిక్‌ లెజెండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యెజ్దీ బైక్లను భారత్‌లో పరిచయం చేయనుంది. 


ఫోటో క్రెడిట్: MotorBeam
 

లాంచ్‌ ఎప్పుడంటే..!
ట్విన్‌ సైలెన్సర్‌ బైక్‌ యెజ్దీ భారత్‌లో వచ్చే ఏడాది జనవరి 13న లాంచ్‌ కానుంది. యెజ్దీ బైక్స్‌లో భాగంగా కనీసం మూడు కొత్త మోటార్‌సైకిళ్లను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యెజ్దీ తన లైనప్‌లో అడ్వెంచర్, స్క్రాంబ్లర్, రోడ్‌స్టర్ మోటార్‌సైకిళ్లను లాంచ్‌ చేయనుంది. ఈ బైక్ల ధర, స్పెసిఫికేషన్‌లు,  లభ్యతపై మరిన్ని వివరాలు వచ్చే నెలలో తెలియనున్నాయి. 


ఫోటో క్రెడిట్: MotorBeam
 

యెజ్దీ బైక్‌ స్పెసిఫికేషన్స్‌ అంచనా..!
జావా మోటార్‌సైకిల్‌ పెరాక్‌లో కనిపించే 334 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో వచ్చే అవకాశం ఉంది. పెరాక్ సుమారు 30 బీహెచ్‌పీ 32.74 ఎన్‌ఎమ్‌ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. కాగా ఈ బైక్‌ పూర్తి వివరాలు తెలియాలంటే లాంచ్‌ డేట్‌ వరకు ఆగాల్సిందే. 



చదవండి: ఊపిరి పీల్చుకోండి..! 2022లో మరోసారి భారీగా పెరగనున్న ఆయా వస్తువుల ధరలు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement