కనిష్ట శ్లాబు వారికి ఐటీ ఊరట కల్పించాలి | CII calls for income tax relief for those in lowest slab | Sakshi
Sakshi News home page

కనిష్ట శ్లాబు వారికి ఐటీ ఊరట కల్పించాలి

Published Mon, Jun 17 2024 4:41 AM | Last Updated on Mon, Jun 17 2024 8:01 AM

CII calls for income tax relief for those in lowest slab

రాబోయే బడ్జెట్‌లో పరిశీలించాలి...

కేంద్రానికి సీఐఐ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ పురి విజ్ఞప్తి  

న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న నేపథ్యంలో తక్కువ స్థాయి శ్లాబ్‌లో ఉన్న ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరట కలి్పంచే అంశాన్ని బడ్జెట్‌లో పరిశీలించాలని పరిశ్రమల సమాఖ్య సీఐఐకి కొత్త ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సంజీవ్‌ పురి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 

భూ, కారి్మక, విద్యుత్, వ్యవసాయ రంగ సంస్కరణలన్నింటిని అమలు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధన కోసం సంస్థాగత వేదికను ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

 ప్రధాని నరేంద్ర మోదీ మూడో దఫా ప్రభుత్వం సంస్కరణలను అమలు చేయడానికి సంకీర్ణ రాజకీయాలనేవి అడ్డంకులు కాబోవని భావిస్తున్నట్లు పురి చెప్పారు. ఇప్పటికే రెండు విడతల్లో విధానాలను విజయవంతంగా అమలు చేయడం, దేశ ఎకానమీ మెరుగ్గా రాణిస్తుండటం వంటి అంశాలు తదుపరి సంస్కరణలను వేగవంతం చేసేందుకు దన్నుగా ఉండగలవని ఆయన పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement