
మన దేశ సంస్కృతిలో బంగారం ఒక కీలకమైన వస్తువు. వివాహాది శుభ కార్యాల్లో కచ్చితంగా బంగారం ఉండాల్సిందే. మహిళలకు ఐతే మరీనూ.. బంగారం అంటే అమితమైన ప్రేమ. బంగారం కొనేటప్పుడు కచ్చితంగా ఒకటికి రెండు సార్లు సరైనదా కాదా..! అని నిర్థారణకు వచ్చిన తరువాతనే కోనుగోలు చేస్తాం. బంగారం స్వచ్చమైనదేనా కాదా అనే విషయంలో బీఐఎస్ హాల్‌మార్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాగా తాజాగా దేశంలోని 256 జిల్లాలో బుధవారం నుంచి బంగారు నగలపై హాల్‌మార్కింగ్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. బంగారంపై ఉన్న హాల్‌మార్క్ సరైనదా.. కాదా అని కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలి. ఎందుకంటే తాజాగా కొన్ని గోల్డ్‌షాపు నిర్వహకులు తమ సొంతంగా హాల్‌మార్క్‌ను ను ముద్రించే అవకాశం ఉంది. కావున గోల్డ్ ఆర్నమెంట్స్ కొనే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి.
వీటిని కచ్చితంగా గమనించండి..!
- హాల్‌మార్క్ గుర్తులో త్రిభుజాకారంలో ఉన్న బీఐఎస్(BIS) గుర్తు సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. గోల్డ్ స్వచ్చత విషయంలో క్యారెటేజ్ 22k915 కచ్చితంగా ఉండేలీ చూడాలి. వీటితో పాటు ఏహెచ్‌సీ గుర్తు ఉండేలా చూసుకోవాలి.
- గోల్డ్‌షాపు యాజమానిని బీఐఎస్ లైసెన్స్‌ను చూపించమని అడగవచ్చు.
- బంగారాన్ని కొనుగోలు చేసిన తరువాత బిల్లులో హాల్‌మార్కింగ్ ఛార్జీలు ఉండేలా చూసుకోవాలి.
- కొనుగోలు చేసిన బంగారంలో స్వచ్చత లేకపోతే విక్రయదారుడ్ని ప్రశ్నించవచ్చు.