వేలం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం

Central Cabinet Decisions On Privatisation - Sakshi

డైరెక్టర్లకు మరిన్ని అధికారాల అప్పగింత

పరిమితం కానున్న ప్రభుత్వ ప్రమేయం

బయో ఫ్యూయల్‌ పాలసీలో కీలక మార్పులు

‘రత్న’ కంపెనీల అమ్మకానికి గ్రీన్‌ సిగ్నల్‌

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు  

ఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయం కేంద్రం వేగం పెంచింది. గతంలో తరహాలో కేంద్ర కేబినేట్‌, సబ్‌ కమిటీ తదితర విషయాలేవీ లేకుండా త్వరగా పెట్టుబడులు ఉపసంహరించేలా కొత్త విధానాలు అమలు చేయబోతున్నారు. ఈ మేరకు బుధవారం జరిగిన కేం‍ద్ర కేబినేట్‌ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు.

డైరెక్టర్లకే అధికారం
వ్యూహాత్మక ప్రభుత్వ రంగ సంస్థలలో వేంగా పెట్టుబడులు ఉపసంహరించాలని కేంద్రం నిర్ణయించింది. వీటితో పాటు పలు సంస్థల్లో ఉన్న మైనార్టీ భాగస్వామ్యాలను సైతం వదులుకోవాలని డిసైడ్‌ అయ్యింది. ఈ ప్రక్రియలో వేగం పెంచేందుకు.. పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయ అధికారం ప్రభుత్వ రంగ సంస్థల డైరెక్టర్లకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో అయితే కేబినేట్‌ జోక్యం ఇందులో ఉండేది.

సబ్సిడరీల మూసివేత
పలు కీలక విభాగాల్లో ప్రభుత్వం భారీ ఎత్తున పెట్టుబడి పెట్టింది. వీటికి అనుబంధంగా పలు సబ్సిడరీ కంపెనీలు కూడా నెలకొల్పింది. అయితే తాజాగా సబ్సిడరీ సంస్థలను మూసివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఉమ్మడి నిర్వహణ సంస్థల యంత్రాంగం మార్పు అధికారం డైరెక్టర్లకే కట్టబెట్టింది. దీని ద్వారా ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.

వేలం ద్వారా
ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ప్రక్రియలో భాగంగా బిడ్లను ఆహ్వానించడం. ఆ తర్వాత పరిశీలించడం.. ఆపై నిర్ణయం తీసుకోవడం వంటి సుదీర్ఘ ప్రక్రియను కుదించింది కేంద్ర కేబినేట్‌. అందులో భాగంగా ప్రభుత్వ సంస్థల అమ్మకం ప్రక్రియను వేలం పాట ద్వారా చేపట్టాలని నిర్ణయించింది. దీంతో ఒకే దశలో ప్రైవేటీకరణ పూర్తయిపోతుంది.

పరిమిత ప్రమేయం
ప్రైవేటీకరణ జరిగగా మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థలలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం తగ్గించాలని కేంద్ర కేబినేట్‌ తాజాగా నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థలు స్వతంత్రంగా పని చేయాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం డైరెక్టర్లకు అప్పగించబోతున్నారు. 

ఇథనాల్‌ తప్పనిసరి
బయో ఫ్యూయల్ పాలసీలో కేంద్రం పలు మార్పులు చేస్తూ ఆమోదం తెలిపింది. అందులో భాగంగా కొత్తగా ఫీడ్ స్టాక్ కు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాదు 2030 నాటికి పెట్రోల్ లో 20 శాతం ఇతర ఇథనాల్ కలపడం తప్పనిసరి చేయనున్నారు. బయో ఫ్యూయల్‌ ప్రోగ్రాం కింద స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటుకు ప్రోత​‍్సహకాలు అందివ్వాలని కేబినేట్‌ నిర్ణయించింది.

రత్నాలను అమ్మేస్తాం 
ఇప్పటి వరకు నష్టాల్లో ఉన్న కంపెనీలను అమ్ముతాం అంటు చెప్పిన కేంద్రం ఇప్పుడు సరికొత్తగా లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను సైతం ప్రైవేటీకరిస్తామని చెబుతోంది. ఈ మేరకు తాజాగా జరిగిన కేబినేట్‌ సమావేశంలో మహారత్న, నవరత్న, మినీ రత్న వంటి ప్రభుత్వ రంగ సంస్థలలో మరింత వేగంగా పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకుంది.

చదవండి: ప్రైవేటీకరణకు ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ఆర్ధిక శాఖ కీలక ఆదేశాలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top