యాంకరేజ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ భారీ ఎఫ్‌డీఐ ప్రతిపాదనకు ఓకే!

CCEA approves Rs 15,000 crore FDI proposal of Anchorage Infrastructure Investment Holding - Sakshi

విలువ రూ.15,000 కోట్లు  

న్యూఢిల్లీ: యాంకరేజ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్‌ రూ.15,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష  పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనకు ప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఈఏ) ఆమోదముద్ర వేసింది. మౌలిక రంగంలో పెట్టుబడులకు ఉద్దేశించి యాంకరేజ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్‌ (కెనడా పెన్షన్‌ ఫండ్‌కు అనుబంధ విభాగం) ఈ భారీ ఎఫ్‌డీఐ ప్రతిపాదనను చేసింది. బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ వాటా యాంకరేజ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్‌కు బదలాయింపు కూడా పెట్టుబడుల్లో భాగంగా ఉంది. ఇటీవల కేంద్రం ప్రకటించిన నేషనల్‌ మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపీ) విధానానికి, ఉపాధి కల్పనకు తాజా ఎఫ్‌డీఐ ప్రతిపాదన భారీ మద్దతునిస్తుందని ఈ మేరకు వెలువడిన ఒక అధికారిక ప్రకటన తెలిపింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top