ఆపిల్‌ సంస్థకు భారీ జరిమానా

Brazil Fines On Apple Over Not Giving Charger - Sakshi

బ్రసిలియా: ప్రముఖ దిగ్గజ మొబైల్‌ కంపెనీ ఆపిల్‌కు భారీ షాక్‌ తగిలింది. ఇటీవల వివాదం రేపిన ఐఫోన్‌ 12 చార్జర్‌, తదితర  ఆరోపణల నేపథ్యంలో బ్రెజిల్ ఆపిల్‌ సంస్థకు‌  రెండు మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.15 కోట్ల) భారీ జరిమానా విధించింది. ఆపిల్‌ కొత్తగా లాంచ్‌ చేసిన ఐఫోన్‌ 12 సిరీస్‌ మొబైల్‌కు చార్జర్‌ ఇవ్వక పోవడంతోపాటు, కంపెనీ ప్రకటనలు తప్పుదోవపట్టించే విధంగా ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

ఈక్రమంలో విచారణ చేపట్టిన బ్రెజిలియన్ కన్‌స్యూమర్‌ ప్రొటక్షన్‌ రెగ్యులేటర్‌ ప్రోకాన్‌- ఎస్పీ ఆపిల్‌కు జరిమానా విధించింది. చార్జర్‌ లేకుండా ఉన్న ఐఫోన్‌, పర్యావరణానికి ఏవిధంగా లాభం చేకుర్చే విషయాన్ని ఆపిల్‌ వివరించలేదని ప్రోకాన్‌- ఎస్పీ తెలిపింది. అంతేకాకుండా ఐఫోన్‌11 ప్రో వాడే వినియోగదారులకు వాటర్‌లో డ్యామేజ్‌ అయిన ఐఫోన్లను రిపేర్‌ చేయలేదని గుర్తు చేసింది.

రెగ్యులేటింగ్‌ బాడీ ఐఓఏస్‌ ఆప్‌డేట్‌లో సమస్యలు, అన్యాయమైన నిబంధనలతో పాటుగా ఆపిల్ అన్ని చట్టపరమైన, హామీలను మిన హాయించింది.  ‘బ్రెజిల్‌ వినియోగదారులకు సరైన వస్తువులను అందించడంలో అసలు రాజీపడదు,  ఆపిల్‌ తమ దేశ వినియోగదారుల చట్టాలను, సంస్థలను గౌరవించాల’ ని ప్రోకాన్-ఎస్పీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫెర్నాండో కాపెజ్ తెలిపారు. 

గత ఏడాది అక్టోబరులో ఆపిల్‌ పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్తగా వచ్చే ఐఫోన్‌ 12 మొబైల్‌తో పాటుగా చార్జర్‌, ఇయర్‌ ఫోన్స్‌ రావని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విధంగా చేయడంతో సుమారు  2 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్‌ను తగ్గించవచ్చునని కంపెనీ తెలిపింది, ఇది ఒక ఏడాదిలో 450,000 కార్లను తొలగించడానికి సమానమని పేర్కొంది.

(చదవండి: భారత్‌లో ఐఫోన్‌–12 అసెంబ్లింగ్‌ )

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top