
'అంబేద్కర్ జయంతి'ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14ను జాతీయ సెలవు దినంగా అధికారికంగా ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా సోమవారం దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు దినంగా పేర్కొంది. అంటే అన్ని బ్యాంకులు మూసి ఉంటాయన్నమాట.
బ్యాంకులు అన్నీ క్లోజ్ అయినప్పటికీ.. ఆన్‌లైన్ బ్యాంకింగ్ (ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్ మొదలైనవి) సేవలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. బ్యాంకులకు వెళ్లి చేసుకోవలసిన పనులన్నీ ఎల్లుండికి (మంగళవారం) వాయిదా వేసుకోవాలి.
ఇతర సెలవు దినాలు
➤15 ఏప్రిల్: బెంగాలీ నూతన సంవత్సరం, భోగ్ బిహు (అసోం, పశ్చిమ్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లోని బ్యాంక్‌లకు సెలవు)
➤18 ఏప్రిల్: గుడ్ ఫ్రైడే (ఛండీగఢ్, త్రిపుర, అసోం, రాజస్థాన్, జమ్ము, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌లోని బ్యాంక్‌లకు సెలవు)
➤20 ఏప్రిల్: ఆదివారం
➤21 ఏప్రిల్: గరియా పూజ (త్రిపురలోని బ్యాంక్‌లకు సెలవు)
➤26 ఏప్రిల్: నాల్గవ శనివారం
➤27 ఏప్రిల్: ఆదివారం
➤29 ఏప్రిల్: పరశురామ జయంతి (హిమాచల్ ప్రదేశ్‌లోని బ్యాంక్‌లకు సెలవు)
➤30 ఏప్రిల్: బసవ జయంతి, అక్షయ తృతీయ (కర్ణాటకలోని బ్యాంక్‌లకు సెలవు)