ఈ వారంలో వ‌రుస‌గా ఐదు రోజులు బ్యాంకుల‌కు సెల‌వు

Banks To Remain Closed For 5 Days in This Week, Check Details Here - Sakshi

మీకు బ్యాంకులో ఏమైనా అత్యవసర పనులు ఉంటే? వెంటనే సెప్టెంబర్ 7 లోపు చేసుకోండి. ఎందుకంటే, సెప్టెంబర్ 8 బుధవారం నుంచి వరుసగా 5 రోజుల పాటు బ్యాంకులు మూసివేయనున్నారు. అయితే, ఈ బ్యాంకు సెలవులు రాష్ట్రాల వారీగా మారతాయి. పైన పేర్కొన్న పండుగ‌లు అన్నీ జ‌రుపుకునే రాష్ట్రాల్లో ఐదు రోజులు సెల‌వులు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో పై పండుగ‌లు అన్నీ ముఖ్య‌మైన‌వి కావు. కాబట్టి, ఆ రాష్ట్రాల్లో ఏ పండుగ అయితే జ‌రుపుకోరో ఆ రోజు ఆ రాష్ట్రంలో బ్యాంకులు ప‌నిచేస్తాయి. ఈ వారంలో వరుసగా రానున్న సెలవులు ఈ క్రింద విధంగా ఉన్నాయి.(చదవండి: ఆకాశంలో ఒక్కసారిగా పేలిపో​యిన రాకెట్‌....!)

  • సెప్టెంబర్‌ 8 తిథి ఆఫ్‌ శ్రీమంత శంకర్‌దేవ(గువాహటి)
  • సెప్టెంబర్‌ 9 తీజ్‌(హరిటలికా) (గ్యాంగ్‌టక్‌)
  • సెప్టెంబర్‌ 10 వినాయక చవితి
  • సెప్టెంబర్‌ 11 గణేశ్‌ చతుర్థి (రెండో శనివారం)
  • సెప్టెంబర్‌ 12 ఆదివారం 

పై లిస్ట్‌లో కేవలం వినాయక చవితి పండుగ నాడు మాత్రమే దేశవ్యాప్తంగా బ్యాంక్‌ లావాదేవీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. మిగతా తేదీలలో రాష్ట్రాల వారీగా సెలవులు ఉంటాయి. అయితే, ఈ సెలవు సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాలకు ఎటువంటి అంతరాయం ఉండదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top