
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రేపో రేటును తగ్గించిన తరువాత.. బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కూడా తన గృహ రుణ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం (రేపో రేటు తగ్గింపు) వల్ల.. మంచి సిబిల్ స్కోర్ ఆధారంగా 8.10 శాతం నుంచి సంవత్సరానికి 7.90 శాతానికి తగ్గింది. ఈ కొత్త రేట్లు 2025 ఏప్రిల్ 15 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ అధికారికంగా వెల్లడించింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేటును తగ్గించడంతో, హోమ్ లోన్స్ మాత్రమే కాకుండా.. వెహికల్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ వంటి వాటిమీద వడ్డీ రేటు తగ్గుతుంది. దీంతో ఈఎంఐలలో మార్పు జరుగుతుంది. ఆర్‌బీఐ రేపో రేటును తగ్గించిన తరువాత.. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి: ఇలా చేస్తే టారిఫ్ ఎఫెక్ట్ ఉండదు!