గృహిణులకు యాక్సిస్‌ బ్యాంక్‌ తీపికబురు..!

Axis Bank Rolls out House Work Is Work initiative  - Sakshi

న్యూఢిల్లీ: విద్యావంతులైన పట్టణ ప్రాంత గృహిణులకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రైవేట్‌ రంగ యాక్సిస్‌ బ్యాంక్‌ ’హౌజ్‌వర్క్‌ఈజ్‌వర్క్(ఇంటిపని కూడా పనే)’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. ఇంటి పనులకే పరిమితమైపోతున్న మహిళలకు, ఉద్యోగాలు చేయగల సత్తా, నైపుణ్యాలు తమలో కూడా  ఉన్నాయనే భరోసా కల్పించేందుకు ఇది తోడ్పడుతుందని బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ (హెచ్‌ఆర్‌) రాజ్‌కమల్‌ వెంపటి తెలిపారు. 

దీని కింద గిగ్‌-ఎ-ఆపర్చూనిటీస్‌ పేరిట వివిధ ఉద్యోగావకాశాలను యాక్సిస్‌ బ్యాంక్‌ తమ ప్లాట్‌ఫామ్‌పై ఉంచిందని వెంటి వివరించారు. దీనికి 3,000 పైచిలుకు దరఖాస్తులు రావడంతో, రాబోయే రోజుల్లో మరింత మందిని రిక్రూట్‌ చేసుకునేలా హైరింగ్‌ పరిమితిని పెంచినట్లు పేర్కొన్నారు. వేతనాల విషయానికొస్తే.. చేరే వారి నైపుణ్యాలు, అనుభవాన్ని బట్టి ఉంటాయని.. పూర్తి స్థాయి ఉద్యోగుల తరహాలోనే ఇతరత్రా ఉద్యోగ ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు.

(చదవండి: మదుపరులకు శుభవార్త.. ఎల్ఐసీ ఐపీఓకు సెబీ ఆమోదం..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top