Axis Bank FD Rates: యాక్సిస్‌ బ్యాంకు ఖాతాదారులా? అయితే మీకో గుడ్‌ న్యూస్‌

Axis Bank Revises Interest Rates On Fixed Deposits Check Latest FD Rates - Sakshi

సాక్షి,ముంబై:  ప్రైవేట్ రంగ  బ్యాంకింగ్‌దిగ్గజం  యాక్సిస్ బ్యాంక్‌ తన ఖాతాదారులకు శుభవార్త అందించింది.  ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను  పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా రేట్లు నిన్న (మంగళవారం, సెప్టెంబర్ 20) నుంచి అమల్లోకి వచ్చాయి.

రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సవరించిన రేట్లు వర్తిస్తాయి. వివిధ డిపాజిట్లపై  సాధారణ పౌరులకు అందించే వడ్డీ 2.75 శాతం నుంచి 5.75  మధ్య ఉండనుంది. అలాగే  సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై అందించే  వడ్డీ 2.75 శాతం నుండి 6.50 శాతం వరకు ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు 11 రోజుల నుండి 1 సంవత్సరం, 25 రోజులు, 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీలకు 5.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇదే అత్యధిక వడ్డీ. 7 రోజులు నుంచి 29 రోజుల కాలవ్యవధికి, బ్యాంక్ 2.75 శాతం అందిస్తుంది; 

7 రోజుల నుండి 14 రోజుల వరకు, సాధారణ ప్రజలకు 2.75 శాతంఅందిస్తుండగా, సీనియర్ సిటిజన్లకు 2.75 శాతం రేటు వర్తిస్తుంది. 30 నెలల నుండి 3 సంవత్సరాల డిపాజిట్లపై  సాధారణ ప్రజలకు 5.70 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.45 శాతం అందిస్తుంది. 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకుగాను సాధారణ ప్రజలకు 5.70 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.45 శాతం. అలాగే 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం వడ్డీని అందిస్తుంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top