అంతరిక్షంలో పెట్రోల్‌ బంకులు, గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నాసా

Australia Neumann Developed Space Fuel Station In Space - Sakshi

పెట్రోల్‌ బంకులు భూమి మీదే కాదు ఇకపై అంతరిక్షంలో  ఏర్పాటు కానున్నాయి. భూమి మీద వాహనదారులు పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్‌ డీజిల్‌ కొట్టించుకొని ప్రయాణం చేస్తుంటే.. అదే మానవుడు (ఆస్ట్రోనాట్స్‌) అంతరిక్షంలో ఇంధనంతో స్పేస్‌లో ప్రయాణించనున్నాడు.    

గత కొంత కాలంగా స్పేస్‌లో దేశాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల రష్యా అంతరిక్షంలో బాధతారాహిత్యంగా ప్రవర్తించింది. యాంటీ శాటిలైట్ మిస్సైల్ పరీక్షలో భాగంగా తన సొంత శాటిలైట్‌ను పేల్చేసింది. దీంతో శాటిలైట్‌కు చెందిన 1,500కు పైగా ఉపగ్రహ శకలాలు 2000 కి.మీ ఎత్తు లేదా అంతకన్నా తక్కువ ఎత్తులో ఉండే భూ కక్ష్య లో (ఎల్ఈఓ)లో తిరుగుతున్నాయి.  రష్యా తీరుపై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా మతిలేని చర్యల వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లోని సిబ్బంది ప్రాణ భయంతో  ఐఎస్ఎస్ క్యాప్సూల్స్‌లో దాక్కోవాల్సి వచ్చినట్లు ద్వజమెత్తింది.  

అయితే ఇలా శాటిలైట్లను పేల్చడంతో పాటు ఇతర శకలాల వల్ల ఉపగ్రహాలకు నష్టం వాటిల్లనుంది. అందుకే పలు దేశాల అంతరిక్ష పరిశోధనా సంస్థలు..ఆ శకలాలు ఉపగ్రహాలపై నిలిపేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన న్యూమన్‌ స్పేస్‌ సంస్థ 'ఇన్‌ స్పేస్‌ ఎలక్ట్రిక్‌ ప్రొపల్షన్‌' పేరుతో కాలం చెల్లిన ఉగప్రహాల శకలాలు, రాకెట్ల విడిబాగాలతో అంతరిక్షంలో థ్రస్ట్‌ పుట్టుకొచ్చేలా ప్రయోగాలు ప్రారంభించింది. అంటే అంతరిక్షంలో రాకెట్లు ముందుకు ప్రయాణించడానికి ఈ థ్రస్ట్‌ ఉపయోగపడుతుంది. థ్రస్ట్‌ రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. అలా థస్ట్‌ రావాలంటే ఇంధనం అవసరం. అందుకే థస్ట్‌ల కోసం స్పేస్‌లోనే శకలాలతో ఇంధనం తయారు చేయనున్నారు. ఒకరకంగా దీన్ని అంతరిక్షంలో పెట్రోల్‌ బంక్‌లను ఏర్పాటు చేయడం అన్నమాటే. భవిష్యత్‌ అవసరాలకోసం నాసా ప్రయోగాలు చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో న్యూమన్‌ స్పేస్‌ సంస్థ ప్రయోగాలు చేస్తుంది. ప్రయోగాలు పూర్తయితే అక్కడ కూడా ఇంధనం దొరకనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top