'వింటేజ్'గా ఆపిల్ ఐకానిక్ ప్రొడక్ట్  | Sakshi
Sakshi News home page

'వింటేజ్' గా ఆపిల్ ఐకానిక్ ప్రొడక్ట్ 

Published Thu, Sep 3 2020 2:41 PM

Apple last iPod Nano model is going to be declared vintage soon - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఆపిల్ తన ఐపాడ్ నానోను వింటేజ్  (వాడుకలో లేని) జాబితాలో చేర్చనుంది. తన ఐకానిక్ నానో లైనప్‌లోని చివరి ఐపాడ్‌ను ‘పాతకాలపు’ ఉత్పత్తుల జాబితాలో చేర్చబోతోందని మాక్‌రూమర్స్ నివేదించింది. ఈ నెల చివరిలో 7వ తరం ఐపాడ్ నానోను  వింటేజ్ ఉత్పత్తుల జాబితాలో చేర్చబోతోందని తెలిపింది.

ఆపిల్ తన తొలి ఐపాడ్ నానోను సెప్టెంబర్ 2005 లో ప్రారంభించింది. కాలక్రమేణా, అనేక మార్పులు చేర్పులతో ఐపాడ్ నానోను సమీక్షిస్తూ కొత్త డిజైన్లతో అప్ డేట్ వస్తోంది. ఈ క్రమంలో  ఆపిల్ 2015లో 7వ జనరేషన్ ఐపాడ్ నానో రిఫ్రెష్ వెర్షన్‌ను విడుదల చేసింది. అయితే  దీనికి క్రమేపీ ఆదరణ తగ్గిపోవడంతో విక్రయాలు  పడిపోయాయి. దీంతో ఐపాడ్ నానో ఇకపై వాడుకలో లేని పాత ఉత్పత్తుల జాబితాలో చేరనుంది.

వింటేజ్ ఉత్పత్తులు 
ఐదుకంటే ఎక్కువ, లేదా ఏడు సంవత్సరాల వరకు విక్రయానికి నోచుకోని ఉత్పత్తులను వింటేజ్ ఉత్పత్తులుగా లెక్కిస్తారు. ఏడు సంవత్సరాల మార్కును దాటిన తర్వాత, అవి వాడుకలో లేనివిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలోనే ఆపిల్ ఐపాడ్ నానో వింటేజ్ జాబితాలో చేరనుందని మాక్‌రూమర్స్ అంచనా వేసింది.

Advertisement
Advertisement