Apple: ఐఫోన్‌ యూజర్లకు శుభవార్త..!

Apple Introduces Additional Payment Options On App Store Itunes - Sakshi

భారత ఐఫోన్‌ యూజర్లకు ఆపిల్‌ శుభవార్తను అందించింది. ఐఫోన్‌ యూజర్లకు యాప్‌ స్టోర్‌ కొనుగోలులో భాగంగా మూడు కొత్త చెల్లింపు మోడ్‌లను ఆపిల్‌ ప్రవేశపెట్టింది. యూపీఐ, రూపే, నెట్‌ బ్యాంకింగ్‌ పేమెంట్స్‌ ఆప్షన్లను ఆపిల్‌ తన యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. గతంలో కేవలం క్రెడిట్‌, డెబిట్‌​ కార్డులతో యాప్‌ స్టోర్‌, ఐట్యూన్స్‌లో చెల్లింపులు జరపడానికి వీలు ఉండేది.


తాజాగా ఆపిల్‌ తీసుకున్న నిర్ణయంతో యూపీఐ, రూపే, నెట్‌ బ్యాంకింగ్‌ పేమెంట్స్‌ ఉపయోగించి చెల్లింపులు జరపవచ్చును. దీంతో అధిక సంఖ్యలో ఆపిల్‌ యూజర్లకు లాభం జరగనుంది. ఐట్యూన్స్‌లో పాటలను కొనుగోలు చేయడానికి యూజర్లకు ఎంతగానో ఉపయోగపడనుంది. టెక్ దిగ్గజం కుపెర్టినో  యాప్ స్టోర్ యూజర్లకు ఈ విషయాన్ని నోటిఫికేషన్ల ద్వారా తెలిపింది. అయితే ఈ సేవలు అప్‌డేట్‌ చేసిన ఐవోస్‌, ఐప్యాడ్‌, మాక్‌ఓఏస్‌ లో వస్తుందని ఆపిల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. 

 మీ ఐఫోన్‌, ఐపాడ్‌లో కొత్త పేమెంట్‌ అప్షన్లను ఇలా యాడ్‌ చేయండి..!

  • మీ ఐఫోన్‌, ఐపాడ్‌లోని సెట్టింగ్‌ ఆప్షన్‌ను ఎంచుకోండి. తరువాత ఆపిల్‌ ఐడీపై ట్యాప్‌ చేయండి.
  • తరువాత పేమెంట్‌ అండ్‌ షిప్పింగ్‌ ఆప్షన్‌పై ట్యాప్‌ చేయండి. మరోసారి మిమ్మిల్సి సైన్‌ ఇన్‌ అవ్వమని అడుగుతోంది.
  • కొత్త పేమెంట్‌ విధానాన్ని యాడ్‌ చేసేందుకు యాడ్‌ పేమెంట్‌ మేథడ్‌ను సెలక్ట్‌ చేసుకోండి.
  • యూపీఐ, రూపే, నెట్‌బ్యాంకింగ్‌ వివరాలను యాడ్‌ చేసేందుకు చూపించే స్టెప్స్‌ను ఫాలో​ అవ్వండి. 
  • అవసరమైతే పేమెంట్‌ మేథడ్‌ను  పునర్వ్యవస్థీకరించడానికి,  తీసివేయడానికి ఎగువ కుడి మూలలో ఉన్న ఎడిట్‌పై క్లిక్‌ చేయండి.
  • యూజర్లు ఆపిల్‌ ఐడీ నుపయోగించి మల్టీపుల్‌ పేమెంట్‌ విధానాలతో చెల్లింపులు జరపవచ్చును.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top