మాస్క్‌ ఉన్న ఫోన్‌ అన్‌లాక్‌ చేయవచ్చు..కేవలం వారికి మాత్రమే..!

Apple Finally Allows Face ID With Mask in iOS 15 4 Beta - Sakshi

కోవిడ్‌-19 రాకతో మాస్క్‌ ప్రతి ఒక్కరికి మస్ట్‌ అనే విధంగా తయారైంది. సరైన మాస్క్‌ను ధరించడంతోనే కరోనా వైరస్‌ నుంచి తప్పించుకోవచ్చునని ఇప్పటికే శాస్త్రవేత్తలు, వైద్యులు ఎంతో మంది సూచించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మనలో కొంతమందికి మాస్క్‌ కొంత చిరాకును కూడా తెచ్చి పెట్టే ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు మరీను..!

ఫేస్‌ అన్‌ లాక్‌ ఫీచర్‌ కల్గిన స్మార్ట్‌ఫోన్లలో కచ్చితంగా మాస్క్‌ను తీసే ఫోన్‌ అన్‌ లాక్‌ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఫోన్‌ పాస్‌వర్డ్‌ను టైప్‌ చేసి అన్‌లాక్‌ చేయాలి. ఫేస్‌ ఐడి అన్‌లాక్‌ కల్గిన ఫీచర్‌ మాత్రం నిరుపయోగంగా మారే పరిస్థితి ఏర్పడింది. అయితే మాస్క్‌ ఉన్న కూడా ఫోన్‌ అన్‌ లాక్‌ చేసే ఫీచర్‌ను త్వరలోనే యాపిల్‌​ తన యూజర్లకు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. 

కేవలం ఈ వెర్షన్‌లో..!
యాపిల్ తమ iOS Beta (iOS 15.4) బీటా వెర్షన్‌‌లో ఈ కొత్త ఫీచర్ రిలీజ్ చేసింది. దాంతో పాటుగా iPadOS 15.4, macOS 12.3 వెర్షన్లలో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఫేస్‌ ఐడీ అన్‌లాక్‌ ఫీచర్‌తో మాస్క్‌ ధరించిన ఫోన్లను లాక్‌చేయవచ్చును. ఈ సరికొత్త ఫీచర్‌ వెంటనే పొందాలంటే ప్రస్తుత ఐవోఎస్‌ వెర్షన్‌ నుంచి ఐవోఎస్‌ 15.4 వెర్షన్‌కు అప్‌గ్రేడ్ కావాల్సి ఉంటుంది. 

మాస్క్‌ ఒక్కటే కాదు..!
గతంలో ఐఫోన్లను పాస్‌వర్డ్‌, ఫింగర్‌ ప్రింట్‌,  యాపిల్‌ వాచ్‌ను ఉపయోగించి సదరు స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్‌ చేసేది. లేటెస్ట్‌ వెర్షన్‌ సహాయంతో ఇకపై పాస్‌వర్డ్‌, యాపిల్‌ వాచ్‌ అవసరం లేకుండానే సులభంగా యాపిల్ డివైజ్ అన్ లాక్ చేయవచ్చు. మాస్క్ ధరించి ఉండగానే ఫోన్ అన్ లాక్ అవుతోంది. మాస్కే కాకుండా ఐఫోన్ వినియోగదారులు గ్లాసెస్ ధరించినప్పుడు కూడా ఫేస్ ఐడిని యాక్సెస్ చేయవచ్చు. నాలుగు విభిన్న రకాల గ్లాసెస్‌తో ఐఫోను లాక్‌ చేసే అవకాశాన్ని యాపిల్‌ తన యూజర్లకు కల్పించనుంది.  

'యూజ్ ఫేస్ ఐడి విత్ ఎ మాస్క్' సెట్టింగ్‌ సహాయంతో ఈ ఫీచర్‌ను పొందవచ్చును. ఐఫోన్ X , తరువాతి మోడల్‌లలో ఫేస్ ఐడి అందుబాటులో ఉన్నప్పటికీ, ఫేస్ ఐడిని మాస్క్‌తో ఉపయోగించే ఫీచర్ ఐఫోన్ 12 , ఐఫోన్‌ కొత్త వెర్షన్‌ ఫోన్లలో మాత్రమే ఈ ఫీచర్‌ పరిమితం కానుంది.  

చదవండి: ఐఫోన్‌లో మరో అదిరిపోయే ఫీచర్..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top