Apple: ఐఫోన్‌13 ఎంట్రీతో షావోమీకు భారీ షాక్‌...!

Apple Beats Xiaomi To Regain Second Global Smartphone Market - Sakshi

షావోమీ కిందికి..ఆపిల్‌ పైకి..శాంసంగ్‌ ఎప్పటిలాగే...!

ఎట్టకేలకు గ్లోబల్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లలో ఆపిల్‌ ప్రముఖ చైనీస్‌ కంపెనీ షావోమీని అధిగమించింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో (క్యూ 3) ఆపిల్ 15 శాతం వాటాతో గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రెండవ స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. ఐఫోన్ 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌కు వీపరితమైన డిమాండ్‌ రావడంతో షావోమిను వెనక్కి నెట్టేసింది. ఎప్పటిలాగానే శాంసంగ్‌ మొదటి స్థానంలో నిలిచింది. గ్లోబల్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లలో శాంసంగ్‌ 23 శాతం వాటాను దక్కించుకుంది.  
చదవండి: నోకియా నుంచి టఫెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌...! లాంచ్‌ ఎప్పుడంటే..

గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కెనాలిస్ అందించిన ప్రాథమిక డేటా ప్రకారం.. స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లలో షావోమీ 14 శాతం వాటాను దక్కించుకోగా  వివో, ఒప్పో స్మార్ట్‌ఫోన్స్‌ 10 శాతం వాటాతో తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లు 6 శాతం మేర తగ్గినట్లు పేర్కొంది. 

చిప్స్‌ కొరత..
అంతర్జాతీయంగా సెమికండక్టర్స్‌ కొరతతో పలు దిగ్గజ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు తీవ్రంగా సతమతమయ్యాయి. చిప్స్‌ కొరత ఉన్నప్పటికీ పలు స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు ఉత్పత్తి విషయంలో రాజీ పడలేదు. చిప్స్‌ కొరత పలు స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు ఫోన్‌ ధరలను కూడా పెంచాయని కానలిస్‌ ప్రిన్సిపల్‌ ఆనలిస్ట్‌ బెన్‌ స్టాన్‌టాన్‌ వెల్లడించారు. స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలకు చిప్స్‌ కొరత 2022 వరకు వేధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
చదవండి: నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' మరో రికార్డు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top