ఆనంద్ మహీంద్రా అద్భుతమైన వీడియో.. వావ్ అంటున్న నెటిజన్స్ | Anand mahindra shares video of bengaluru mysuru expressway vande bharat train passing underneath | Sakshi
Sakshi News home page

ఆనంద్ మహీంద్రా అద్భుతమైన వీడియో.. వావ్ అంటున్న నెటిజన్స్

Feb 14 2023 4:00 PM | Updated on Feb 14 2023 4:26 PM

Anand mahindra shares video of bengaluru mysuru expressway vande bharat train passing underneath - Sakshi

సాక్షి, ముంబై: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు, ఇందులో భాగంగానే ఇటీవల తన ట్విటర్ ద్వారా ఒక వీడియో షేర్ చేశారు.  ప్రస్తుతం ఈ వీడియో  ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది.

డ్రోన్ వీడియోను షేర్ చేస్తూ 'బెంగుళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే కింద వందే భారత్ ట్రైన్ వెళుతోంది, గ్లోబల్-స్టాండర్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భారతదేశాన్ని ఎలా మారుస్తుందో అని చెప్పడానికి ఇది నిలువెత్తు నిదర్శనం అని చెప్పుకొచ్చారు'. ఈ వీడియోకి వేల సంఖ్యలో లైకులు రాగా, చాలా మంది కామెంట్స్ కూడా చేశారు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియోలో ఒక ఎక్స్‌ప్రెస్‌వే కింద 'వందే భారత్' ట్రైన్ వెళ్లడం చూడవచ్చు. ఈ అద్భుతమైన సన్నివేశం 'బెంగళూరు-మైసూరు' ఎక్స్‌ప్రెస్‌వే వద్ద చూడవచ్చు. నిజానికి బెంగళూరు - మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే రెండు దశల్లో ఉంటుంది. ఫేజ్-1 కింద 58 కిమీ పొడవుతో బెంగళూరు - నిడఘట్ట మధ్య, ఫేజ్-2 కింద 61 కిమీ పొడవుతో నిడఘట్ట - మైసూర్ మధ్య ఉంది.

గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వే మంగళూరుని బెంగుళూరుతో కలుపుతుంది. 119 కిమీ పొడవైన ఈ ఎక్స్‌ప్రెస్‌వే చాలా అందంగా కనిపించడమే కాకుండా, మధ్యలో వివిధ రైల్వే క్రాసింగ్‌ల పైన వెళుతుంది. అలాంటి రైల్వే క్రాసింగ్‌లలో ఒక క్రాసింగ్ వీడియో ఆనంద్ మహీంద్రా మనసు దోచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement