ఆనంద్‌ మహీంద్ర : జుగాద్‌ వీడియో వైరల్‌

Anand Mahindra Shared Video going viral - Sakshi

సాక్షి, ముంబై: మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూపు ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.  ఇన్నోవేటివ్‌గా ఉంటూ, తనను ఆకర్షించిన పలు రకాల వీడియోలను ట్వీట్‌ చేయడం  ఆయనకు అలవాటు.   తాజా మరో ఆసక్తికరమైన వీడియోను ఆనంద్‌ మహీంద్ర ట్వీట్ చేశారు. నిర్వహణ ఖర్చులను తగ్గించే జుగాద్‌ చిట్కా వీడియోనొకదాన్ని  షేర్‌ చేశారు.  బాహుబలి బల్లాల దేవుడు కత్తుల రథంలా ఉన్న  ఈ చీపుళ్ల   రథం వీడియో వైరల్‌గా మారింది. 
 
ఎంతో ఖర్చు పెట్టి, లేదా శ్రమకోర్చి గంటల తరబడి చేసే పనిని.. చాలా సులువుగా చటుక్కున పరిష్కరించే  ఐడియానే  జుగాద్‌. ఈ తరహా ఆలోచనా ధోరణితో రూపొందించిన రోడ్లను ఊడ్చే యంత్రం తాజాగా ఈ పారిశ్రామికవేత్తను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అంతే వెంటనే ఆ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇది  ఎవరు ఎక్కడ  కనిపెట్టారో తెలియదుగానీ తనకు చాలా నచ్చేసిందంటూ  వాట్సాప్‌ వండర్‌ బాక్స్‌ తనకు  వచ్చిన వీడియోను ట్వీట్‌చేశారు.   నిజానికి ఇదొక సౌందర్య రూపకల్పన అంటూ అబ్బుర పడ్డారు. అయితే ఇలాంటి జుగాద్‌ ఐడియాను ఝకాస్‌గా (అందంగా) షూట్‌ చేయాలని తాను ఎప్పటినుంచో సూచిస్తున్నానన్నారు. అంతేకాదు ఇలాంటి  జుగాద్‌ చిట్కాలో రూపొందించిన  డివైస్‌లతో ఒక  మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నానని,     బహుశా చెన్నైలోని మహీంద్ర రీసెర్చ్‌ వాలీలోనే  కావచ్చంటూ ట్వీట్‌ చేశారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top