మీరు నిజమైన సూపర్ హీరో: ఆనంద్‌ మహీంద్రా

Anand Mahindra Acknowledges Matka Man - Sakshi

ఆటోమొబైల్‌ దిగ్గజ కంపెనీ మహీంద్రా చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారనే విషయం మన అందరికీ తెలిసిందే. ఆలోచనాత్మక, సందేశాత్మక పోస్ట్‌లతో అభిమానులు, ఫాలోవర్లను అలరించడం ఆనంద్‌ మహీంద్రాకు ఇష్టం. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే వాటి మీద స్పందించడంతో పాటు అప్పుడప్పుడూ కొన్ని ఆలోచనాత్మక పోస్టులు చేస్తుంటారు. తాజాగా తన ట్విటర్ వేదికగా మరో పోస్టు చేశారు. మహీంద్రా బోలెరోను సామాజిక సేవ కోసం వినియోగిస్తున్న 'మట్కా మ్యాన్' గురుంచి ట్వీట్ చేశారు.

సూపర్ హీరో
ఈ ట్వీట్‌లో "మార్వెల్ కంటే శక్తివంతమైన సూపర్ హీరో మట్కామన్. అతను ఇంగ్లాండ్‌లో ఒక వ్యవస్థాపకుడు & క్యాన్సర్ విజేత, అతను పేదలకు సేవ చేయడానికి భారతదేశానికి తిరిగి వచ్చాడు. మీ సామాజిక సేవ కోసం బొలెరోను వినియోగించుకున్నందుకు ధన్యవాదాలు సర్"అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. అలగ్ నటరాజన్(మట్కా మ్యాన్) దక్షిణ ఢిల్లీలో ఉన్న మట్టి కుండలను (మట్కాస్) నింపడానికి మహీంద్రా బొలెరోను ఉపయోగించారు. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అతన్ని మొత్తం మార్వెల్ సూపర్ హీరోలతో పోల్చాడు.(చదవండి: ఎలక్ట్రిక్ మార్కెట్‌లోకి హోండా మోటార్స్!)

దక్షిణ ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో మట్కాస్ నింపడానికి ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకు ఈ హీరో మేల్కొంటాడు. 72 ఏళ్ల నటరాజన్ ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి నిర్విరామంగా పని చేస్తున్నారు. ఇతను కేవలం పెద ప్రజలకు తాగునీటిని అందించడం కాకుండా నిర్మాణ కార్మికుల కోసం పోషకాహార సలాడ్ తయారు చేసి పంపిణీ చేస్తారు.అలాగే దారిలో సెక్యూరిటీ గార్డులు, డ్రైవర్లకు ఆహారాన్ని అందిస్తారు. ఈ సలాడ్‌లో 20 రకాల ఆహార పదార్థాలు ఉంటాయి.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top