క్రిప్టోకరెన్సీకి పోటీగా...సరికొత్త వ్యూహంతో ఆఫ్రికన్‌ దేశాలు...!

Amid Crypto Boom Nigeria Ghana In Race To Have Own Digital Currency - Sakshi

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై అనేక మంది ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. క్రిప్టోకరెన్సీపై అనేక దేశాలో నిషేధం ఉన్నప్పటికీ ఆయా దేశ పౌరులు క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్‌ చేస్తూనే ఉన్నాయి. ఎల్‌ సాల్వాడార్‌, పరాగ్వే వంటి దేశాలు బిట్‌కాయిన్‌ లాంటి క్రిప్టోకరెన్సీలను చట్టబద్దత కల్పిస్తామని పేర్కొన్నాయి. ఈ నిర్ణయంలో పలు క్రిప్టోకరెన్సీలు కొత్త రికార్డులను నమోదు చేస్తూ గణనీయంగా పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఆరు వేలకుపైగా క్రిప్టోకరెన్సీలు ఉన్నాయి. వీటిలో బిట్‌కాయిన్‌, ఈథిరియం, డాగ్‌కాయిన్‌ వంటివి ఎక్కువ ఆదరణను పొందాయి. 
చదవండి: Bitcoin: అదృష్టమంటే ఇదేనేమో...! తొమ్మిదేళ్లలో రూ. 6 లక్షల నుంచి రూ. 216 కోట్లు...!

సరికొత్త వ్యూహంతో ఆఫ్రికన్‌ దేశాలు...
తాజాగా క్రిప్టోకరెన్సీలకు పోటీగా ఆఫ్రికన్‌ దేశాలు సరికొత్త వ్యూహంతో ముందుకువస్తున్నాయి. క్రిప్టోకరెన్సీకి బదులుగా సొంత డిజిటల్‌ కరెన్సీలను అందుబాటులోకి తీసుకురానుంది. పశ్చిమ ఆఫ్రికాలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను కలిగిన నైజీరియా, ఘనా దేశాల సెంట్రల్‌ బ్యాంకులు డిజిటల్‌ కరెన్సీను త్వరలోనే ప్రవేశపెట్టాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది క్రిప్టో దత్తతలో నైజీరియా ఆరో స్థానంలో నిలవడం గమనార్హం. నైజీరియా, ఘనా దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు విదేశీ కరెన్సీల డిజిటల్ వెర్షన్‌లను రూపొందించడానికి విదేశీ ఫైనాన్షియల్ టెక్ కంపెనీలతో భాగస్వామ్యమయ్యాయి. డిజిటల్‌ కరెన్సీపై పనిచేస్తోన్న దేశాల వరుసలో నైజీరియా, ఘనా కూడా  చేరాయి. 

త్వరలోనే ట్రయల్స్‌...!
పలు విదేశీ ఫైనాన్షియల్‌ టెక్‌ కంపెనీలతో నైజీరియా, ఘనా దేశాలు డిజిటల్‌ కరెన్సీ ఏర్పాటులో కీలక అడుగువేసినట్లు తెలుస్తోంది. ఆఫ్రికాలో నైజీరియా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థను కల్గి ఉంది. వచ్చే నెల అక్టోబర్‌ 1 నుంచి  ‘ఈనైరా’ అనే డిజిటల్‌ కరెన్సీ ప్రారంభించనుంది. మరోవైపు ఈ నెల నుంచి ‘ఈసేడీ’ డిజిటల్‌ కరెన్సీలను ట్రయల్‌ చేయనున్నట్లు సమాచారం. 

పడిపోతున్న కరెన్సీ విలువ...!
గత కొన్ని రోజుల నుంచి నైజీరియా క్రిప్టో కరెన్సీ వాడకంలో బూమ్‌ కన్పించినా... అక్కడి బ్యాంకులు క్రిప్టోపై బ్యాన్‌ విధించాయి. నైజీరియన్‌ పౌరులు ఎక్కువగా క్రిప్టోలో లావాదేవీలను జరుపడంతో నైజీరియన్ కరెన్సీ విలువ పూర్తిగా పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో క్రిప్టోకరెన్సీలకు పోటీగా డిజిటల్‌ కరెన్సీలను తీసుకురావాలని నైజీరియా నిర్ణయించుకుంది. 
చదవండి: Bitcoin: బిట్‌కాయిన్‌ విలువ రెట్టింపుకానుందా ..! బ్లూమ్‌బర్గ్‌ సంచలన ప్రకటన..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top