
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ‘సాథి’ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విక్రేతలు తమ ఆన్‌లైన్ వ్యాపార విస్తరణకు కావాల్సిన సలహాలు, సూచనలను విక్రేతల నుంచే స్వీకరించడం దీని ప్రత్యేకత. సాథీస్ (మెంటార్స్) నుంచి ఆన్‌లైన్ అమ్మకాలు, అనుసరించాల్సిన ఉత్తమ విధానాల గురించి అమెజాన్ విక్రేతలు ఎవరైనా తెలుసుకోవచ్చు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎనమిది నెలల్లో 41,000 పైచిలుకు విక్రేతలు 50కిపైగా మెంటార్స్‌ను సంప్రదించినట్టు అమెజాన్ మంగళవారం వెల్లడించింది.