iPhone 12 Series Huge Discounts In Amazon: Check Offer Price For Various Models - Sakshi
Sakshi News home page

iPhone 12 Series : ఫోన్లపై భారీ తగ్గింపు...!

Jun 27 2021 4:08 PM | Updated on Jun 27 2021 6:23 PM

Amazon Is Offering Discounts Of Up To Rs 9000 On Various Models Of The Iphone 12 - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ఆపిల్‌ కంపెనీ ఉత్పత్తులకు ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. ఆపిల్‌ ఐఫోన్లకు మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్‌. ఆపిల్‌ ఈ ఏడాది చివరికల్లా ఐఫోన్‌ 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోని రిలీజ్‌ చేయనున్నట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఆపిల్‌ ఐఫోన్‌ 12 సిరీస్‌ ఫోన్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఐఫోన్‌ 12 బేసిక్ మోడల్‌పై సుమారు రూ. 9000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఐఫోన్‌ 12 సిరీస్‌ మొబైల్‌ మోడళ్లపై భారీ తగ్గింపును ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ అమెజాన్‌ నుంచి పొందవచ్చును.

అమెజాన్‌ తన కస్టమర్లకు  ఐఫోన్ 12  బేసిక్‌ మోడల్(64జీబీ)  రూ .70,900 కు  అందిస్తోంది. ఐఫోన్‌ 12 బేసిక్ అసలు ధర రూ. 79,900. 128 జీబీ  ఐఫోన్‌ 12 మోడల్‌ పై సుమారు రూ. 5000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. కాగా 256 జీబీ వేరియంట్‌పై ఏలాంటి ఆఫర్‌ను అందించడంలేదు. ఐఫోన్‌ 12 మినీ వేరియంట్‌ పై సుమారు రూ. 6000 వరకు డిస్కౌంట్‌ వస్తోంది. అంతేకాకుండా అమెజాన్‌ పే, లేదా ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు నుంచి కొనుగోలు చేస్తే రూ. 400 క్యాష్‌బ్యాక్‌ లభించనుంది.

చదవండి: ఈ ఏడాది చివరలో ఐఫోన్‌ 13..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement