టీవీ, స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ తగ్గింపును ప్రకటించిన అమెజాన్‌..! ఏకంగా రూ. 10 వేలకు పైగా.. | Sakshi
Sakshi News home page

Amazon: టీవీ, స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ తగ్గింపును ప్రకటించిన అమెజాన్‌..! ఏకంగా రూ. 10 వేలకు పైగా..

Published Sun, Feb 13 2022 12:31 PM

Amazon Mobile And TV Savings Days Sale Announced With Discount On Smartphone Smart Tv - Sakshi

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ టీవీ, స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ తగ్గింపును ప్రకటించింది. కొనుగోలుదారులకోసం అమెజాన్‌ మొబైల్‌ అండ్‌ టీవీ సేవింగ్‌ డేస్‌ సేల్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సేల్‌ లైవ్‌లో ఉంది. ఈ సేల్‌ ఫిబ్రవరి 15తో ముగియనుంది.

వన్‌ప్లస్‌, శాంసంగ్‌, షావోమీ, రియల్‌మీ, ఒప్పో, టెక్నో, వంటి స్మార్ట్‌ఫోన్స్‌పై 10 శాతం తగ్గింపుతో పాటు పలు బ్యాంకు కార్డులపై కూడా తగ్గింపును అందిస్తోంది అమెజాన్‌. ఇక స్మార్ట్‌టీవీలపై ఏకంగా 40 శాతం మేర తగ్గింపును అమెజాన్‌ ప్రకటించింది. ఇక మొబైల్‌ యాక్సెసరీస్‌పై కూడా డిస్కౌంట్‌ రేట్లకే అందిస్తోంది. 

మొబైల్‌ అండ్‌ టీవీ సేవింగ్స్‌ డేస్‌లో అమెజాన్‌ అందిస్తోన్న కొన్ని ఆఫర్స్‌ ఇవే..!

► Redmi Note 11T 5G ధర రూ. 19,999 కాగా అసలు ధర రూ. 22,999

► Mi 11X స్మార్ట్‌ఫోన్‌ రూ. 25,999 తగ్గింపుతో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 6,000 డిస్కౌంట్‌తో పాటుగా అదనంగా మొబైల్‌ ఎక్సేఛేంజ్‌పై రూ. 3,000 తగ్గింపు.

► Samsung Galaxy M52 5G స్మార్ట్‌ఫోన్‌ రూ. 22,999కు అందుబాటులో ఉండనుంది. దీని అసలు ధర రూ.34,999. 

► Samsung Galaxy M32 5G స్మార్ట్‌ఫోన్‌ రూ. 20,999కు అందుబాటులో ఉండనుంది. దీని లిస్టెడ్‌ ధర రూ. 23,999. 

► Iqoo Z5 ధర రూ. 21,990 తగ్గింది. దీని లిస్టెట్‌ ధర రూ. 29,990. Iqoo 7 ధర రూ. 27,990.  

► Realme Narzo 50A ధర ప్రస్తుతం రూ. 10,349 తగ్గింది, దీని అసలు ధర రూ. 12,999.

► ఇక Oppo, Realme, Tecno ఈ స్మార్ట్‌ఫోన్స్‌ను ఫెడరల్ బ్యాంక్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపును పొందవచ్చును. 

► 32-అంగుళాల Redmi TV ప్రస్తుతం రూ. 14,998, ఈ స్మార్ట్‌టీవీపై ఏకంగా రూ. 10,001 తగ్గింపు. 

► 50-అంగుళాల Redmi TV ఆఫర్‌ ప్రైజ్‌ రూ. 34,998. దీని అసలు ధర రూ.44,999.

► 32-అంగుళాల Mi Horizon ఫుల్- HD TV ధర రూ. 16,499కు రానుంది. 

► 43-అంగుళాల Samsung క్రిస్టల్ 4K ప్రో UHD TV అసలు ధర రూ. 52,900 కాగా  ప్రస్తుతం రూ. 36,990 కు అందుబాటులో ఉండనుంది. 

► OnePlus స్మార్ట్ టీవీ ప్రస్తుతం రూ. 16,499  తక్కువ ధరకే రానుంది. 

► 50-అంగుళాల AmazonBasics 4K TV పై 40 శాతం వరకు తగ్గింపుతో రూ. 23,001కు అందుబాటులో ఉండనుంది. 

చదవండి: అమెజాన్‌ బంపరాఫర్‌..! ప్రైమ్‌ సభ్యత్వంపై 50 శాతం తగ్గింపు..!

Advertisement
 
Advertisement
 
Advertisement