అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌: బంగారం, వెండి నాణేలపై భారీ డిస్కౌంట్‌ | Sakshi
Sakshi News home page

Amazon Dhanteras Store: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌: బంగారం, వెండి నాణేలపై భారీ డిస్కౌంట్‌

Published Mon, Nov 1 2021 9:00 PM

Amazon Dhanteras Store Announced Offers On Gold Coins And Smartphones - Sakshi

దివాళీ ఫెస్టివల్‌ సీజన్‌ సందర్భంగా ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ భారీ ఆఫర్లను ప్రకటించింది. బంగారం, వెండి నాణేలు, టీవీలు, హోమ్‌ అప్లయన్సెస్‌ పై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు తెలిపింది. 

బంగారు నాణేలపై ఆఫర్‌ 
ధన్‌తేరాస్ సందర్భంగా అమెజాన్ ధన్‌తేరాస్‌ షాపింగ్‌ స్టోర్‌ పేరుతో బంగారు నాణేలపై 20 శాతం డిస్కౌంట్‌,  వెండి నాణేలపై 20 శాతం డిస్కౌంట్‌ అందిస్తోంది. అలాగే బంగారం, వెండి ఆభరణాలపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. అంతేకాదు డైమండ్ ఆభరణాలపై జీరో శాతం మేకింగ్ ఛార్జీలు ఉంటాయని పేర్కొంది. ఇక ఈ సేల్‌లో  ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్, రూపే క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై 10 శాతం డిస్కౌంట్‌ అందిస్తుంది.  

అమెజాన్ ధన్‌తేరాస్‌ షాపింగ్ స్టోర్లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లపై  40 శాతం తగ్గింపును అందిస్తోంది. స్మార్ట్ టీవీలపై 65 శాతం వరకు తగ్గింపు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లపై కూడా 40 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది

ఆఫర్లు ఎలా ఉన్నాయ్‌
దాదాపూ నెలరోజులుగా కొనసాగుతున్న అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ రేపటితో ముగియనుంది. అయితే మరికొన్ని గంటల్లో ముగియనున్న ఈ సేల్‌లో టీవీలు, హోమ్‌ అప్లయన్సెస్‌ 65శాతం డిస్కౌంట్లు ఇస్తున్నట్లు ట్వీట్‌ చేసింది. మొబైల్‌,యాక్సెసరీలపై అమెజాన్ 40 శాతం, పురుషులు, మహిళల ఫ్యాషన్‌లో 80 శాతం డిస‍్కౌంట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.

చదవండి:సేల్స్‌ బీభత్సం..! గంటలో 5లక్షల ఫోన్‌లు అమ్ముడయ్యాయి..!

Advertisement
 
Advertisement
 
Advertisement