పిల్లల భోజనానికి వాఘ్‌ బక్రీ చేయూత | Akshaya Patra Receives 8 Food Vans from Wagh Bakri Foundation | Sakshi
Sakshi News home page

పిల్లల భోజనానికి వాఘ్‌ బక్రీ చేయూత

Mar 31 2026 8:59 AM | Updated on Mar 31 2026 9:38 AM

Akshaya Patra Receives 8 Food Vans from Wagh Bakri Foundation

అక్షయపాత్రకు ఎనిమిది ఆహార పంపిణీ వాహనాల విరాళం 

అక్షయపాత్ర ఫౌండేషన్‌కు వాఘ్‌ బక్రీ టీ గ్రూప్‌ ఫౌండేషన్‌ ప్రత్యేకంగా రూపొందించిన ఎనిమిది ఆహార పంపిణీ వాహనాలను అందించింది. హైదరాబాద్‌లోని కంది, ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఈ వాహనాలను ప్రారంభించారు. వీటిలో ఐదు తెలంగాణకు, మూడు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఈ వాహనాలు ఉష్ణోగ్రత నియంత్రణ సదుపాయాలతో ఉండి, పాఠశాల పిల్లలకు వేడి, పోషకాహార భోజనం సమయానికి అందేలా సహకరిస్తాయి.

ఈ ఎనిమిది వాహనాల కోసం రూ.99 లక్షలు ఖర్చు చేశారు. దీంతో వాఘ్‌ బక్రీ ఫౌండేషన్‌ ఇప్పటివరకు మొత్తం 38 వాహనాలను అందించి, సుమారు రూ.5 కోట్లను ఖర్చు చేసింది. ఈ సందర్భంగా వాఘ్‌ బక్రీ టీ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పరాస్‌ దేశాయ్‌ మాట్లాడుతూ, ‘‘అక్షయపాత్రతో మా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం కావడం గర్వంగా ఉంది. ఈ వాహనాలు దూర ప్రాంతాల్లోని పిల్లలకు పోషకాహార భోజనాన్ని సురక్షితంగా, సమయానికి అందేలా కీలక పాత్ర పోషిస్తాయి. విద్యకు మద్దతు ఇవ్వడంలో పోషకాహారం ముఖ్యమని మేము నమ్ముతున్నాము’’ అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రము ఖ టీవీ యాంకర్‌ సుమ కనకాల హాజరయ్యారు. వాఘ్‌ బక్రీ చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని ఆమె ప్రశంసించారు. పిల్లల పోషణ, విద్యాభివృద్ధికి ఇది కీలకమని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల

Advertisement
 
Advertisement
Advertisement