breaking news
vans
-
పిల్లల భోజనానికి వాఘ్ బక్రీ చేయూత
అక్షయపాత్ర ఫౌండేషన్‌కు వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఫౌండేషన్ ప్రత్యేకంగా రూపొందించిన ఎనిమిది ఆహార పంపిణీ వాహనాలను అందించింది. హైదరాబాద్‌లోని కంది, ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఈ వాహనాలను ప్రారంభించారు. వీటిలో ఐదు తెలంగాణకు, మూడు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఈ వాహనాలు ఉష్ణోగ్రత నియంత్రణ సదుపాయాలతో ఉండి, పాఠశాల పిల్లలకు వేడి, పోషకాహార భోజనం సమయానికి అందేలా సహకరిస్తాయి.ఈ ఎనిమిది వాహనాల కోసం రూ.99 లక్షలు ఖర్చు చేశారు. దీంతో వాఘ్ బక్రీ ఫౌండేషన్ ఇప్పటివరకు మొత్తం 38 వాహనాలను అందించి, సుమారు రూ.5 కోట్లను ఖర్చు చేసింది. ఈ సందర్భంగా వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాస్ దేశాయ్ మాట్లాడుతూ, ‘‘అక్షయపాత్రతో మా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం కావడం గర్వంగా ఉంది. ఈ వాహనాలు దూర ప్రాంతాల్లోని పిల్లలకు పోషకాహార భోజనాన్ని సురక్షితంగా, సమయానికి అందేలా కీలక పాత్ర పోషిస్తాయి. విద్యకు మద్దతు ఇవ్వడంలో పోషకాహారం ముఖ్యమని మేము నమ్ముతున్నాము’’ అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రము ఖ టీవీ యాంకర్ సుమ కనకాల హాజరయ్యారు. వాఘ్ బక్రీ చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని ఆమె ప్రశంసించారు. పిల్లల పోషణ, విద్యాభివృద్ధికి ఇది కీలకమని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల -
డిజిటల్ మొబైల్ వ్యాన్లను ప్రారంభించిన గవర్నర్ తమిళసై
-
మహీంద్రా నుంచి ఇ-సుప్రో వ్యాన్స్
న్యూఢిల్లీ: దిగ్గజ వాహన తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా సుప్రో వ్యాన్ ఎలక్ట్రిక్ వెర్షన్ (ఇ-సుప్రో)ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది కార్గో, ప్యాసింజర్ అనే రెండు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. జీరో ఎమిషన్ వెహికల్స్ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేసుకునే లక్ష్యంలో భాగంగా కంపెనీ ఈ వాహనాలను మార్కెట్లోకి తెచ్చింది. ఇ-సుప్రో కార్గో వ్యాన్ ప్రారంభ ధర రూ.8.45 లక్షలుగా ఉంది. ఇక ఇ-సుప్రో ప్యాసింజర్ వ్యాన్ ధర రూ.8.75 లక్షల నుంచి ప్రారంభమౌతోంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. బ్యాటరీ ఫుల్ చార్జ్‌కి 8 గంటల 45 నిమిషాల సమయం పడుతుందని, ఒక ఫుల్ చార్జ్‌తో ఈ వాహనాలు 112 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయని కంపెనీ పేర్కొంది. కాగా ఈ ఎలక్ట్రిక్ వాహనాల గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు. కంపెనీ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్ నుంచి వచ్చిన మూడవ వాహనం ఇది. మహీంద్రా ఇదివరకే ఇ-20, ఇ-వెరిటో అనే రెండు వాహనాలను మార్కెట్లోకి తె చ్చింది.


