 
													సురక్షితమైన విమాన ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని దుబాయ్ విమానాశ్రయం దాని నియమాలలో కొన్ని మార్పులు చేసింది. సాధారణంగా ప్రయాణికులు క్యాబిన్ బ్యాగ్‌లో మందులు వంటి ముఖ్యమైన వస్తువులను తీసుకెళ్లవచ్చు. కానీ ఇప్పుడు దుబాయ్ వెళ్లే విమానంలో ఇది సాధ్యం కాదు. మీరు అన్ని రకాల మందులను తీసుకెళ్లలేరు. కొత్త నిబంధనల ప్రకారం.. మీరు అనుమతించిన వస్తువులను మాత్రమే తీసుకెళ్లాలి.
దుబాయ్ విమాన లగేజీ నిబంధనలలో మార్పులు
చాలా సార్లు ప్రయాణికులు తమకు తెలియకుండానే అనుమతి లేని కొన్ని వస్తువులను తమతో విమానంలోకి తీసుకెళ్తుంటారు. వీటిని విమానంలో తీసుకెళ్లడం చట్టపరమైన నేరంగా పరిగణిస్తారు. మీరు దుబాయ్ వెళ్తుంటే విమానంలో చెక్-ఇన్ లగేజీతో పాటు క్యాబిన్ బ్యాగేజీలో ఏమి ప్యాక్ చేయవచ్చు.. ఏమి చేయకూడదు అనే విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. దుబాయ్‌కి ప్రయాణించేటప్పుడు బ్యాగుల్లో ఎలాంటి వస్తువులను తీసుకువెళ్లవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
ఈ ఉత్పత్తులను బ్యాగులో తీసుకెళ్లకూడదు
- కొకైన్, హెరాయిన్, గసగసాలు, మత్తు కలిగించే మందులు. 
- తమలపాకులు, కొన్ని మూలికలు వంటివి కూడా తీసుకెళ్లకూడదు. 
- ఏనుగు దంతాలు, ఖడ్గమృగం కొమ్ములు, జూద వస్తువులు, మూడు పొరల ఫిషింగ్ నెట్‌లు, బహిష్కృత దేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులను తీసుకెళ్లడం కూడా నేరంగా పరిగణిస్తారు. 
- ముద్రిత వస్తువులు, ఆయిల్ పెయింటింగ్‌లు, ఛాయాచిత్రాలు, పుస్తకాలు, రాతి శిల్పాలను కూడా తీసుకెళ్లకూడదు. 
- నకిలీ కరెన్సీ, ఇంట్లో వండిన ఆహారం, మాంసాహారం కూడా తీసుకెళ్లకూడదు. 
- ప్రయాణికులెవరైనా ఈ నిషేధిత వస్తువులను తీసుకెళ్తున్నట్లు తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. 
ఈ మందులను అస్సలు తీసుకెళ్లలేరు
- బెటామెథోడోల్ 
- ఆల్ఫా-మిథైల్ఫెనానిల్ 
- గంజాయి 
- కోడాక్సిమ్ 
- ఫెంటానిల్ 
- పాపీ స్ట్రా కాన్సన్‌ట్రేట్ 
- మెథడోన్ 
- నల్లమందు 
- ఆక్సికోడోన్ 
- ట్రైమెపెరిడిన్ 
- ఫెనోపెరిడిన్ 
- కాథినోన్ 
- కోడైన్ 
- యాంఫెటమైన్ 
వీటిని చెల్లింపుతో తీసుకెళ్లవచ్చు
దుబాయ్ ట్రిప్‌కు వెళ్లేటప్పుడు కొన్ని రకాల వస్తువులను చెల్లింపుతో తీసుకెళ్లవచ్చు. ఈ జాబితాలో మొక్కలు, ఎరువులు, మందులు, వైద్య పరికరాలు, పుస్తకాలు, సౌందర్య సాధనాలు, ట్రాన్స్మిషన్,  వైర్‌లెస్ పరికరాలు, ఆల్కహాలిక్ పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ఈ-సిగరెట్లు, ఎలక్ట్రానిక్ హుక్కాలు ఉన్నాయి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
