హైదరాబాద్‌–లండన్‌ మధ్య నాన్‌స్టాప్‌ ఫ్లయిట్‌

Air India to start direct flights to London from Hyderabad - Sakshi

తొలి సరీ్వస్‌ నేడు హైదరాబాద్‌లో ల్యాండింగ్‌

హైదరాబాద్‌: ఎయిరిండియా హైదరాబాద్‌– లండన్‌ మధ్య నాన్‌స్టాప్‌ విమాన సరీ్వస్‌ను ప్రారంభించింది. తొలి విమానం గురువారం హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ కానుంది. ఇదే విమానం తిరిగి 10వ తేదీన (శుక్రవారం) లండన్‌ బయల్దేరి వెళుతుంది. 256 సీట్ల సామర్థ్యం (బిజినెస్‌క్లాస్‌ 18, ఎకానమీ క్లాస్‌ 238 సీట్లు) కలిగిన బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను వారానికి రెండు సరీ్వసుల కింద ఎయిరిండియా నడపనుంది.

హైదరాబాద్‌ నుంచి ప్రతీ సోమవారం, శుక్రవారం లండన్‌కు విమాన సరీ్వస్‌ ఉంటుందని ఎయిరిండియా తెలిపింది. ప్రయాణ సమయం 10.30 గంటలు. అదే లండన్‌ నుంచి హైదరాబాద్‌ మార్గంలో ప్రయాణ సమయం 9.20 గంటలుగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అమృత్‌సర్, కొచ్చి, అహ్మదాబాద్, గోవా విమానాశ్రయాల నుంచి లండన్‌కు ఎయిరిండియా నాన్‌స్టాప్‌ సరీ్వసులను నిర్వహిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top