breaking news
boeing 787 dreamliner
-
ఎయిరిండియాకు డ్రీమ్‌లైనర్ క్రాష్ సెగ
న్యూఢిల్లీ: గతవారం బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ విమానం కుప్పకూలిన నేపథ్యంలో విమానయాన సంస్థ ఎయిరిండియా బుకింగ్స్, చార్జీలు పడిపోయాయి. దేశ, విదేశీ రూట్లలో బుకింగ్స్ 20 శాతం పడిపోగా, చార్జీలు సైతం సగటున 8–15 శాతం తగ్గాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. జూన్ 12న 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుంచి లండన్‌కి బైల్దేరిన కాస్సేపటికే ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఉదంతం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ రూట్లలో బుకింగ్స్ తగ్గడాన్ని గమనించామని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీవో) ప్రెసిడెంట్ రవి గోసాయి తెలిపారు. అంతర్జాతీయ రూట్లలో బుకింగ్స్ 18–22 శాతం, దేశీయంగా 10–12 శాతం మేర తగ్గినట్లు వివరించారు. అయితే, ఇదంతా తాత్కాలికమే కావచ్చని ఆయన పేర్కొన్నారు. ఇక ఇండిగో, ఆకాశతో నేరుగా పోటీ ఉన్న దేశీ రూట్లలో ఎయిరిండియా టికెట్ల చార్జీలు 8–12 శాతం తగ్గినట్లు గోసాయి చెప్పారు. అంతర్జాతీయంగా, ముఖ్యంగా యూరప్, ఆగ్నేయాసియా రూట్లలో చార్జీలు 10–15 శాతం క్షీణించినట్లు వివరించారు. పలువురు ప్రయాణికులు ఎయిరిండియా ఫ్లయిట్స్‌లో ప్రయాణాలను రద్దు కూడా చేసుకున్నట్లు చెప్పారు. ప్రధానంగా కార్పొరేట్, హై–ఎండ్ లీజర్ ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమాన సంస్థలకు మళ్లినట్లు వివరించారు. గత వారం రోజులుగా అంతర్జాతీయ రూట్లలో క్యాన్సిలేషన్లు 15–18 శాతం, దేశీ రూట్లలో 8–10 శాతం స్థాయిలో ఉన్నట్లు గోసాయి చెప్పారు. అయితే, ఎయిరిండియా విమానాలు అంతర్జాతీయ భద్రత ప్రమాణాలను పాటిస్తున్నట్లుగా నియంత్రణ సంస్థలు ధృవీకరిస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి మారొచ్చని వివరించారు. మరోవైపు, ఎయిరిండియా ఫ్లయిట్స్ బుకింగ్స్ 15–20 శాతం వరకు, చార్జీలు కొన్ని రూట్లలో 10 శాతం వరకు తగ్గినట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ఇండియన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహ్రా చెప్పారు. -
పరిహార భారం ఎయిర్ ఇండియాదే
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ దుర్ఘటనలో ఖరీదైన బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం నామరూపాల్లేకుండా ధ్వంసమైపోయింది. విమానం ఖరీదు, బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని ఎవరు భరిస్తారన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. విమానానికి బీమా సదుపాయం ఎలాగూ ఉంటుంది. బీమా సంస్థ నుంచి నష్టాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద ఏవియేషన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాబోతోందని నిపుణులు చెబుతున్నారు. ఇక బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత విమానయాన సంస్థదే. అంటే ఇక్కడ ఎయిర్ ఇండియాదే. ఈ విషయంలో స్పష్టమైన నియమ నిబంధనలు ఉన్నాయి. 1999 నాటి మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం.. విమానం ప్రమాదానికి గురై ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగితే, ఎవరైనా క్షతగాత్రులుగా మారితే సంబంధిత విమానయాన సంస్థే ఆ నష్టాన్ని భరించాలి. విమానంలో ప్రయాణికుల వస్తువులు, సామగ్రి ధ్వంసమైనా, అవి వారికి అందడంలో ఆలస్యం జరిగినా పరిహారం ఇవ్వాల్సిందే. అహ్మదాబాద్ ప్రమాదంలో ఎయిర్ ఇండియా సంస్థ ఒక్కో బాధిత కుటుంబానికి 1,51,880 స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(ఎస్డీఆర్) ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ఎస్డీఆర్ విలువ దాదాపు రూ.120. ఈ లెక్కన ఒక్కో కుటుంబానికి రూ.1.80 కోట్లు పరిహారంగా ఇవ్వాల్సి ఉంది. ఎస్డీఆర్ను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) గతంలోనే ఖరారు చేసింది. అహ్మదాబాద్ ప్రమాదంలో 265 మంది మృతిచెందారు. మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం వీరందరికీ కలిపి ఎయిర్ ఇండియా యాజమాన్యం రూ.435 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులు కాకుండా విమానంలో పనిచేసే సిబ్బందికి చట్టప్రకారం అదనపు పరిహారం ఇవ్వక తప్పదు. మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం విమాన ప్రమాదంపై దర్యాప్తు పూర్తికాక ముందే బాధిత కుటుంబాలకు 16,000 ఎస్‌డీఆర్‌లు(రూ.18 లక్షలు) అడ్వాన్స్‌గా చెల్లించాలి. మాంట్రియల్ తీర్మానం కింద ఇచ్చే పరిహారంతో పాటు ఒక్కో కుటుంబానికి అదనంగా రూ.కోటి చొప్పున ఇస్తామని టాటా గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది. అంటే ఒక్కో కుటుంబానికి రూ.2.80 కోట్ల పరిహారం దక్కబోతోంది. ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ యాజమాన్యంలో ఉన్న సంగతి తెలిసిందే. బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ విమానాన్ని దాదాపు రూ.960 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించినట్లు తెలిసింది. విమానానికి బీమా, బాధితులకు ఇచ్చే పరిహారం మొత్తంగా చూస్తే ఈ విలువ రూ.1,000 కోట్ల నుంచి రూ.1,250 కోట్ల వరకు ఉంటుంది. -
వెయ్యి డిగ్రీల వేడిలోనూ బ్లాక్ బాక్స్ భద్రం
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తులో బ్లాక్ బాక్స్, డిజిటల్ వీడియో రికార్డర్(డీవీడీ) అత్యంత కీలకం కాబోతున్నాయి. ఈ రెండింటిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానం పేలిపోయినప్పుడు అందులోని ఇంధనం కారణంగా ఏకంగా 1,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వెలువడింది. విమానం మొత్తం మంటల్లో చిక్కుకుంది. మృతదేహాలు మసిబొగ్గులా మారాయంటే ప్రమాద తీవ్రతను అంచనా వేయొచ్చు. భారీ ఉష్ణోగ్రతలోనూ బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉంటుందని, అందులోని డేటా చెరిగిపోదని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ బాక్స్‌లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్(ఎఫ్డీఆర్), మరొకటి కాక్‌పిట్ వాయిస్ రికార్డర్(సీవీఆర్). ఎఫ్‌డీఆర్‌లో సాంకేతికపరమైన అంశాలు నిక్షిప్తమవుతాయి. అంటే విమానం ఎగురుతున్న ఎత్తు, వేగం, ఇంజన్ పనితీరును ఇది రికార్డు చేస్తుంది. కాక్‌పిట్‌లోని శబ్ధాలు, సంభాషణలు సీవీఆర్‌లో నమోదవుతాయి. టైటానియం లేదా స్టెయిన్లెస్ స్టీల్‌తో బ్లాక్‌బాక్స్ తయారు చేస్తారు. ఇది 1,100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతోపాటు అత్యధిక ఒత్తిడిని సైతం తట్టుకోగలదు. అంతేకాకుండా ఇది వాటర్‌ప్రూఫ్. నీటిలో 6 వేల మీటర్ల లోతున కూడా 30 రోజులపాటు భద్రంగా ఉంటుంది. నీటిలో దీని జాడ సులభంగా కనిపెట్టవచ్చు. అందులోని నుంచి సంకేతాలు వెలువడుతుంటాయి. డీవీఆర్ అనేది బ్లాక్‌బాక్స్ కంటే భిన్నమైనది. విమానంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఇందులో ఉంటుంది. విమానం కాక్‌పిట్, కేబిన్‌లో ఈ కెమెరాలు ఏర్పాటు చేశారు. బ్లాక్ బాక్స్, డీవీఆర్ డేటాను ప్రత్యేక ల్యాబ్‌ల్లో ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించబోతున్నారు. ఇందుకోసం ఢిల్లీలో ఇటీవలే డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ ల్యాబ్ ప్రారంభించారు. దెబ్బతిన్న రికార్డర్లను మరమ్మతు చేసి, డేటాను వెలికితీసే సదుపాయం ఇక్కడ ఉంది. -
ఇంజన్ వైఫల్యమే!
దేశాన్ని దిగ్భ్రాంతికి లోను చేసిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ (వీటీ–ఏఎన్‌బీ) 171 విమాన ప్రమాదానికి ఇంజన్ వైఫల్యమే కారణమై ఉంటుందని వైమానిక రంగ నిపుణులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే పెను ప్రమాదాన్ని సూచిస్తూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు పైలట్ చేసిన మేడే కాల్లోనూ, ప్రమాద వీడియోల్లోనూ విమానం ఇంజన్ శబ్దం అసలు విన్పించమే లేదు. దాన్నిబట్టి విమానం అప్పటికే పూర్తిగా థ్రస్ట్ (ఎగిరేందుకు అవసరమైన వేగం) పూర్తిగా కోల్పోయిందని విశ్లేషిస్తున్నారు. పక్షులు ఢీకొట్టడం వంటివి ఇందుకు కారణం కావచ్చంటున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో పక్షుల బెడద ఎక్కువే. అయితే బోయింగ్‌లో అత్యాధునికమైన ఈ శ్రేణి విమానాల్లో రెండు అత్యంత శక్తిమంతమైన ఇంజన్లుంటాయి. ఒకటి అనుకోకుండా ఫెయిలైనా రెండో ఇంజన్ సాయంతో విమానం సునాయాసంగా ఎగరగలదు. దాన్ని బట్టి రెండు ఇంజన్లూ విఫలమై ఉంటాయని అనుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ 10 లక్షల ప్రయాణాలకు కేవలం ఒకసారి మాత్రమే అలా జరిగే ఆస్కారముంటుంది! ఇంధన కల్తీ, యాంత్రిక వైఫల్యం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చు. కానీ బోయింగ్ 787లో వాడేది అత్యంత శక్తిమంతమైన జనరల్ మోటార్స్ కంపెనీ తాలూకు జీఈఎన్ఎక్స్ ఇంజన్లు. అవి అత్యంత విశ్వసనీయమైనవి. ఈ నేపథ్యంలో ప్రమాద కారణం పెద్ద పజిల్‌గా మారింది. బ్లాక్‌బాక్స్ డేటాను పూర్తిగా విశ్లేషించిన మీదటే దీనిపై స్పష్టత వస్తుందని నిపుణులు అంటున్నారు. వారి విశ్లేషణ ప్రకారం ప్రమాద కారణాలు ఏమై ఉండొచ్చంటే...టేకాఫ్ సెట్టింగుల్లో లోపంవిమానం టేకాఫ్ కాగానే లాండింగ్ గేర్ మూసుకోవాలి. సురక్షితమైన ఎత్తుకు చేరేదాకా రెండు ఫ్లాప్‌లూ (రెక్కల వెనక భాగం) విచ్చుకుని ఉండాలి. అప్పుడే విమానానికి ఎగిరేందుకు అవసరమైన శక్తి, ఊపు లభిస్తాయి. వీటన్నింటినీ టేకాఫ్ సెట్టింగులుగా పిలుస్తారు. ఇకగురువారం మధ్యాహ్నం ప్రమాద సమయంలో అహ్మదాబాద్‌లో ఏకంగా 43 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో వాయుసాంద్రత తక్కువగా ఉంది. అలాంటప్పుడు లాండింగ్ గేర్, ఫ్లాప్‌లు అత్యంత కచ్చితత్వంతో పని చేయడం చాలా కీలకం. కానీ ఏఐ171 విమానం గేర్ తెరుచుకునే ఉండగా ఫ్లాప్‌లు మూసుకుపోయాయి. ఇది పెను ప్రమాదానికి దారితీసే అసాధారణ పరిస్థితి. దీనివల్ల పైకెగిరేందుకు కావాల్సిన శక్తి సమకూరక విమానం అదుపు తప్పుతుంది. పైగా అవసరమైన థ్రస్ట్ లభించకుండానే పైలట్ టేకాఫ్‌కు ప్రయత్నించి ఉంటాడంటున్నారు. ఇలా ఫ్లాప్‌లు వెంటనే ముడుచుకుపోవడం వల్లే 2008లో స్పాన్‌ఎయిర్ విమానం కుప్పకూలింది.సరిపోని థ్రస్ట్ బోయింగ్ ఇంజన్లు శక్తిమంతమైనవే అయినా విమానం బరువు, రన్‌వే పొడవు, ఉష్ణోగ్రత తదితరాల ఆధారంగా టేకాఫ్‌కు నిర్దిష్ట థ్రస్ట్ సెటింగ్‌లు అవసరమవుతాయి. 43 డిగ్రీల ఎండ ఉన్నందున ఇంజన్ సామర్థ్యం సహజంగానే కాస్త తగ్గుతుంది. అలాంటప్పుడు టేకాఫ్‌కు మామూలు కంటే అధిక థ్రస్ట్ తప్పనిసరి. కానీ ఏఐ171 పైలట్ రొటేషన్ స్పీడ్‌ను పొరపాటుగా లెక్కించి తక్కువ థ్రస్ట్ ప్రయోగించి ఉండొచ్చు. 241 మంది ప్రయాణికులు, భారీ లగేజీ, ఏకంగా 1.25 లక్షల లీటర్ల ఇంధన బరువు దీనికి తోడై విమానం సజావుగా ఎగరలేకపోయి ఉంటుంది.లాండింగ్ గేర్ వైఫల్యంప్రమాద సమయంలో ఏఐ171 విమానం లాండింగ్ గేర్ తెరుచుకునే ఉంది. ఇది డ్రాగ్‌కు దారితీస్తుంది. దాంతో విమానం సజావుగా ఎగరలేదు. అందుకే టేకాఫ్ అయ్యాక క్షణాల్లోనే గేర్ మూసుకోవాల్సి ఉంటుంది. కానీ తొలుత దాదాపుగా మూసుకున్న ఏఐ171 లాండింగ్ గేర్ ఆ వెంటనే బయటికొస్తూ కన్పించింది. బహుశా విమానాన్ని పైకి తీసుకెళ్లేందుకు అవసరమైన థ్రస్ట్ లభించడం లేదని అర్థమై ఎమర్జెన్సీ లాండింగ్‌కు వీలుగా పైలట్ ఉద్దేశపూర్వకంగానే అలా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. మొత్తం ఉదంతంలో ఏదో ఒక దశలో పైలట్ లోపం కచ్చితంగా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి లోపాలను సునాయాసంగా అధిగమించే అత్యాధునిక సాంకేతికత 787 సొంతం. ఇక్కడే పైలట్ మానవ తప్పిదం చోటుచేసుకుని ఉంటుందంటున్నారు.విద్రోహ కోణంఉగ్రవాదులో, దేశ వ్యతిరేక శక్తులో ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని కూల్చేయడం. కానీ ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న సమాచారం,సాక్ష్యాలను బట్టి ఇందుకు అవకాశాలు తక్కువే.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ సీటులో ఉంటే భద్రమేనా?
అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదం నుంచి రమేశ్ విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. విమానంలో 11ఏ సీటులో కూర్చున్న రమేశ్ క్షేమంగా బయటపడ్డాడు. బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ విమానంలో ఈ సీటు ఎకానమీ క్లాస్ కేబిన్‌లో మొదటి వరుసలో ఉంటుంది. విమానంలో కుడి పక్కన రెక్కల కంటే రెండు వరుసల ముందు కిటికీ పక్కనే ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లడానికి ఉద్దేశించిన ఎమర్జెన్సీ డోరు వెనుకే 11ఏ సీటు ఏర్పాటు చేశారు. ఈ స్థానంలో కూర్చోవడం రమేశ్ ప్రాణాలతో బయటపడడానికి కారణమైనట్లు నిపుణులు చెబుతున్నారు. 11ఏ సీటు (Seat 11A) సురక్షితమని భావిస్తున్నారు.హాట్‌లైన్ నెంబర్మరోవైపు విమాన ప్రమాదంతోపాటు మృతులకు సంబంధించిన సమాచారం అందించడానికి ఎయిర్ ఇండియా సంస్థ 1800 5691 444 హాట్‌లైన్ నెంబర్ ఏర్పాటు చేసింది. విదేశీయుల కోసం +91 8062779200 నెంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.విమానం కొత్తదే! న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో గురువారం కుప్పకూలిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం మరీ పాతదేమీ కాదని ఏవియేషన్ అధికారులు తెలిపారు. ఈ విమానం 2013లో సేవలు ప్రారంభించిందని వెల్లడించారు. 12 సంవత్సరాల నుంచి ఇది వాణిజ్య సేవలు అందిస్తోంది. పౌర విమానయాన రంగంలో 12 సంవత్సరాలు అంటే దాదాపు కొత్త విమానం కిందే లెక్క అని నిపుణులు తెలిపారు. ఈ విమానం వీటీ–ఏఎన్‌బీ పేరుతో రిజిస్టర్ అయ్యింది. ఎయిర్ ఇండియా సంస్థ వద్ద ఉన్న బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ రకానికి చెందిన 27 విమానాల్లో ఇదీ ఒకటి. ఈ రకానికి చెందిన ఒక విమానం ప్రమాదంలో పూర్తిగా ధ్వంసం కావటం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. 2020లో కాసరగోడ్‌లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కూలిపోయిన ఘటన తర్వాత దేశంలో అతిపెద్ద విమాన ప్రమాదం కూడా ఇదే.చదవండి: నాన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే.. -
పక్షి ఢీకొట్టిందా?
గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన బోయింగ్ 787–7 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాద దుర్ఘటనలో.. ఇంకా కారణాలు నిర్ధారణ కానప్పటికీ పక్షి ఢీకొట్టడం వల్లే ఇది జరిగిందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. భారత్‌లో 2015లో ఇలాంటి పెద్ద ప్రమాదం జరిగింది. కత్రా నుండి వైష్ణోదేవి ఆలయానికి వెళుతున్న హెలికాప్టర్.. రాబందు ఢీకొనటంతో పల్టీలు కొట్టి, మంటలు చెలరేగి పైలట్‌తో సహా ఏడుగురు చనిపోయారు. రన్‌వేపై లేదా గాల్లో పక్షులు ఢీకొనడం వల్ల గతంలో మనదేశంలో అనేక విమాన ప్రమాద దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుత ప్రమాదం జరిగిన అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో.. 2022తో పోలిస్తే 2023లో దాదాపు రెట్టింపునకు పైగా ఇలాంటి ప్రమాదాలు జరగడం గమనార్హం. 2022లో కేవలం 39 ప్రమాద ఘటనలే జరిగితే ఆ తరవాతి ఏడాది ఈ సంఖ్య 81కి పెరిగింది. ఢిల్లీ రన్‌వేపై 700సార్లు! పక్షులు ఢీకొన్న సంఘటనలు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యధికంగా జరిగాయి. 2018–2023 మధ్య ఆ రన్‌వేలపై 700 కేసులు నమోదయ్యాయి. 2023 డిసెంబరు 18న రాజ్యసభలో పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఇచ్చిన సమాధానం ప్రకారం.. భారతదేశంలో అ త్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలు వన్యప్రాణు లు, ప్రధానంగా పక్షుల బెడదతో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని తెలుస్తోంది. గత ఏడాది ఎమిరేట్స్ విమానం ముంబైలో ఫ్లెమింగోల గుంపును ఢీకొట్టడంతో 39 పక్షులు చనిపోయాయి. పక్షులు తగిలితే ఎందుకు కూలిపోతాయి? నిజానికి పక్షుల తగిలినంత మాత్రానే విమానాలు కూలిపోవు. కొన్ని సందర్భాలలో ఇంజిన్ లేదా ఇతర భాగాలకు నష్టం వాటిల్లుతుంది. విమానాలు చాలా వేగంగా టేకాఫ్ అవుతాయి. పక్షులు, ముఖ్యంగా పెద్ద పక్షులు; ఇంజిన్ లేదా విండ్షిల్డ్లోకి ప్రవేశించే పక్షి సమూహాలు ఢీకొనడం వల్ల మాత్రం పెద్ద ముప్పే వాటిల్లవచ్చు. టేకాఫ్ దశలో ఇంజిన్ చాలా వేగంతో తిరుగుతున్నప్పుడు, విమానం తక్కువ ఎత్తులో ఉండగానే పక్షి ఢీకొన్నప్పుడు ఇంజిన్ ఫ్యాన్ బ్లేడ్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీంతో ఇంజిన్ విఫలమై ప్రమాదం సంభవించవచ్చు. పక్షి ఢీకొట్టగానే పైలట్ దృష్టి చెదిరి ప్రమాదాలు జరుగుతుంటాయి. అన్ని పక్షులూ ముప్పుకాదు 1966–1989 మధ్య కాలంలో తీవ్రమైన విమాన నష్టానికి కారణమైన పక్షుల జాబితాలో రాబందులు ఒకప్పుడు అగ్రస్థానంలో ఉండేవి. వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోవటంతో వాటి వల్ల ముప్పు తగ్గింది. నేడు ప్రధానంగా బ్లాక్ కైట్స్ (డేగ జాతి), గబ్బిలాలు, ల్యాప్‌విగ్ పక్షులు ప్రమాదం కలిగించే జాబితాలోకి చేరాయి. 2020 జూన్‌లో ‘డిఫెన్స్ లైఫ్’సైన్స్ జర్నల్ లో ‘భారతదేశంలో విమానాలకు వన్యప్రాణుల తాకిడి’అనే శీర్షికతో ప్రచురితమైన అధ్యయన పత్రం ప్రకారం.. ఈ మూడు జాతుల పక్షులే ఇప్పుడు ప్రధానంగా రన్‌వేపై విమాన ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. 2012–2018 మధ్య భారతదేశంలో 3,665 వన్యప్రాణుల తాకిళ్లు సంభవించినట్లు ఈ పత్రం పేర్కొంది. వీటిల్లో 385 ఘటనలు విమాన నష్టానికి కారణం అయ్యాయి. 2005–2018 మధ్య మూడు సైనిక విమానాలు కూలిపోవటానికి బ్లాక్ కైట్స్ పక్షులే కారణం. -
ప్రయాణికులపాలిట పీడకల... డ్రీమ్‌లైనర్
విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాల కోసం కలలు రెక్కలు కట్టుకుని విమానం ఎక్కే వందలాది మంది ప్రయాణికులు తాజాగా బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ పేరు చెప్పగానే హడలిపోతున్నారు. ఇది మార్గమధ్యంలో కూలిపోయి తమ కలలను కల్లలుచేస్తుందన్న ప్యాసింజర్ల భయాందోళల నడుమ ఈ మోడల్ విమానంపై సర్వత్రా చర్చ నెలకొంది. అమెరికా విమానతయారీరంగ దిగ్గజం బోయింగ్ 2011లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన ఈ విమానం ఇప్పుడు అత్యంత అప్రతిష్టను మూటగట్టుకుంటోంది. దీంతో ఈ మోడల్ విమానం గత విజయాలు, విశేషాలతోపాటు వివాదాలపర్వాన్ని యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. వేర్వేరు చోట్ల తయారుచేసి మరోచోట విడిభాగాలను పటిష్టమైన ప్రామాణాలను పాటించకుండానే బిగిస్తున్నారని, డిజైన్ లోపాలున్నాయని ఈ మోడల్‌పై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్ పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి గమనిద్దాం. విలాసానికి మారుపేరు.. ఎప్పుడొచ్చింది? 2011లో విశ్వవిపణిలోకి తొలిసారిగా అడుగుపెట్టినప్పుడు బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్ విమానంలోని సదుపాయాలు, సామర్థ్యాన్ని చూసిన వాళ్లంతా ఔరా అనేశారు. ఎక్కువ మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతోపాటు సుదూరాలకు ఇది అవలీలగా వెళ్లగలదు. కొనుగోలుచేసిన, నిర్వహణ సంస్థకు అనువుగా 242 నుంచి గరిష్టంగా 290 వరకు ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చు. సామర్థ్యం ఎంత? ఏకధాటిగా ఎక్కడా ఆగకుండా ఏకంగా 13,530 కిలోమీటర్లు ప్రయాణించగలదు. దీంతో సుదూర నగరాల మధ్య సంధానకర్తగా ఇది మంచి పేరు తెచ్చుకుంది. అత్యంత పటిష్టమైన, అత్యంత తేలికైన మూలకాలతో విమాన నిర్మాణ విడిభాగాలను తయారుచేశారు. దీంతో మిగతా పోటీ సంస్థల మోడళ్లతో పోలిస్తే దీని బరువు తక్కువగా ఉంటుంది. మైలేజీపరంగా తక్కువ ఇంధనంతో పనిచేస్తుంది. టెక్నాలజీ ఎలాంటిది? కొత్తతరం డిజైన్, అధునాతన ఫ్లై–బై–వైర్ కంట్రోలర్లతో పనిచేస్తుంది. ప్రతి ఆదేశాన్ని పైలట్ ఇవ్వాల్సిన పనిలేకుండా గాల్లో కదిలే దిశ, ఒంపుకు అనుగుణంగా ఆటోమేటిక్‌గా కంప్యూటరే ఆదేశాలు ఇచ్చే వ్యవస్థ ఇందులో ఉంది. అత్యాధునిక ప్రయాణికుల భద్రతా ఏర్పాట్లు దీనిలో ఉన్నాయి. సింథటిక్ విజన్ సిస్టమ్(ఎస్వీఎస్) సాయంతో కింద ఉన్న భూభాగాన్ని త్రిమితీయ(3డీ) ఫొటోలు తీసి ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో రన్‌వేపై పక్షులు, ఎయిర్పోర్ట్ వస్తువులు ఏమైనా ఉన్నాయోలేదో వెంటనే అలర్ట్చేస్తుంది. మంచుదుప్పటి కప్పుకున్నా, భీకర వర్షం పడుతున్నా రన్‌వే పరిసరాలను స్పష్టంగా చూపిస్తుంది. ఇంకెన్ని ఫీచర్లు ఉన్నాయి? ప్రయాణికుల సీటింగ్ క్యాబిన్, కాక్‌పిట్, కార్గో సెక్షన్లు అన్నింటిపైనా సమీకృత పర్యవేక్షణ ఉండేలా ఇంటిగ్రేటెడ్ మాడ్యులర్ ఏవియానిక్స్(ఐఎంఏ) విధానంతో విమానం పనిచేస్తుంది. ఆక్సిజన్ పీడనం, ఇంధన లీకేజీలు, హఠాత్తుగా ప్రయాణ ఎత్తు తగ్గడం, పిడుగులతో కుదుపులకు లోనవడం వంటి సందర్బాల్లో వెనువెంటనే ఆటోమేషన్‌లో తనంతట తానుగా సర్దుబాటు చేసుకునే వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. మరి లోపాలేంటి? తొలిరోజుల్లో నవతరం విమానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన 787–8 డ్రీమ్‌లైనర్ నెమ్మదిగా విమర్శల సుడిగుండంలో పడింది. 2013లో ఈ మోడల్ విమానాల్లో లిథియం అయాన్ బ్యాటరీలు పేలిపోయాయి. దీంతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్(ఎఫ్ఏఏ) వీటి రాకపోకలను స్తంభింపజేసింది. విమానం మధ్యలోని ప్రధాన విడిభాగాన్ని ఇతర భాగాలను అనుసంధానించేటప్పుడు సరైన ప్రమాణాలను పాటించట్లేరని 2019లో తొలిసారిగా ఆరోపణలు వచ్చాయి. బిగింపుల మధ్య అతుకులు సరిగా పూడ్చట్లేరని, ఇందుకు కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కూడా తోడైందని వెల్లడైంది. దీంతో తరలింపు కోసం వాడిన బోల్ట్‌లు ఆ తర్వాత సైతం జాయింట్ల వద్ద అలాగే ఉండిపోయి మొత్తం వ్యవస్థకే సమస్యాత్మకంగా మారుతున్నాయి. సమీక్ష జరిపాకే ఎయిర్‌లైన్స్‌లకు కొత్త విమానాలను డెలివరీ చేయాలని ఎఫ్ఏఏ ఆదేశించడంత 2021 జనవరి నుంచి 2022 ఆగస్ట్‌దాకా 787 సిరీస్‌ల డెలివరీ ఆగిపోయింది.లోపాలను ఎత్తిచూపిన సీనియర్ ఉద్యోగులు ఏళ్ల తరబడి బోయింగ్ సంస్థలో పనిచేసిన సీనియర్ ఇంజినీర్లు ఈ మోడల్ విమానాల్లో లోపాలు ఉన్నట్లు పలుమార్లు బహిరంగంగా చెప్పారు. బోయింగ్ సంస్థలో ఇంజనీర్‌గా 17 ఏళ్లపాటు పనిచేసిన మాజీ ఉద్యోగి సామ్ సలేహ్‌పౌర్ 2024లో ఎఫ్ఏఏకు ఫిర్యాదు కూడా చేశారు. ‘‘విడిభాగాల ఉత్పత్తి దశలో బోయింగ్ అడ్డదారులు తొక్కుతోంది. విడిభాగాల బిగింపు సమయంలో అత్యున్నత స్థాయి ప్రమాణాలను పాటించట్లేదు. హడావిడిగా తుది ఆమోద ముద్ర వేసేలా ఇంజనీరింగ్ సిబ్బందిపై ఒత్తిడి చేస్తోంది. సరైన బిగింపు లేకపోవడం వల్ల విమానం పాతబడేకొద్దీ లోపం అనేది అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అసెంబ్లీ యూనిట్లలో సిబ్బంది అడవిలో టార్జాన్ మాదిరిగా ఒక చోట నుంచి మరోచోటుకు వేగంగా మారుతూ పనిని సవ్యంగా చేయట్లేరని సంస్థకు ఎన్నోసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. 2020 ఏడాది నుంచి మూడుసార్లు సంస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేస్తే నన్ను ‘నోరు మూస్కో’అన్నారు. ఇన్ని లోపాలతో తయారైన ఈ లోహ విహంగాలు టిక్ టిక్ శబ్దం చేసే టైంబాంబులే. రక్షణ, భద్రతా సంస్కృతికి బోయింగ్ తిలోదకాలిస్తోంది’’అని సలేహ్‌పౌర్ ఆరోపించారు.సమస్యలు ఎత్తిచూపి శాశ్వత నిద్రలోకి.. క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్‌గా 32 ఏళ్లు బోయింగ్‌లో పనిచేసిన జాన్ బార్నెట్ సైతం పలు లోపాలను ఎత్తిచూపారు. ‘‘అత్యధిక పని ఒత్తిడి కారణంగా సిబ్బంది.. తయారీ లోపాలున్నాసరే ఆయా భాగాలను బిగించేస్తున్నారు. ఆక్సీజన్ వ్యవస్థల్లో ఇలాంటి లోపాలను గుర్తించా. ప్రతి నాలుగింట ఒక ఎమర్జెన్సీ బ్రీతింగ్ మాస్్కలో లోపం ఉంది. వాడేటప్పుడు ఇవి విఫలమవడం ఖాయం’’అని అన్నాడు. ఈ లోపాలను బయటపెట్టినందుకు ఈయనపై కేసు నమోదైంది. తర్వాత ఈయన ఆత్మహత్యచేసుకున్నారు. విమానాల్లో లోపాల ను క్వాలిటీ ఆడిటర్ జాషువా డీన్ సైతం బయటపెట్టారు. తర్వాత ఆయన సైతం అనారోగ్య సమస్యలతో చనిపోయారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే!
Ahmedabad Plane Crash గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానం - ఫ్లైట్ AI-171 కుప్పకూలిపోయింది. గురువారం (2025 జూన్ 12వ తేదీ) లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్తున్న ఈ విమానంలో సిబ్బందితో సహా 242 మంది ఉన్నారు. వీరిలోఇద్దరు పైలట్లు ,10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. ఈ విమానం కెప్టెన్ సుమీత్ సభర్వాల్ నేతృత్వంలో ఫస్ట్ ఆఫీసర్‌గా క్లైవ్ కుందర్ ఉన్నారు. ఈ దుర్ఘటపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సహా పలువురు నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంధన సామర్థ్యం, అధునాతన సాంకేతికత ,సౌకర్యవంతమైన ప్రయాణీకుల అనుభవానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సుదూర విమానం బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌తో మొట్టమొదటి ప్రాణాంతక ప్రమాదం ఇదని నిపుణులు భావిస్తున్నారు. ఎంతమంది చనిపోయారు అనేది దానిపై పూర్తి స్పష్టత లేనప్పటికీ, మరణాల సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చని భావిస్తున్నారు. విమానంలో ప్రయాణిస్తున్నవారిలో 169 మంది భారతీయులు, 53 బ్రిటిష్ పౌరులు,ఒకకెనడియన్, ఏడుగురు పోర్చుగీసు వారున్నారు. వీరిలో ఎంత మంది ప్రాణాలున్నారు అనేది సందేహమే.#WATCH | Air India plane crash: "My sister was going to London. She had her flight around 1.10 pm, but the flight crashed," says Bhawna Patel as she arrived at the Civil Hospital in Ahmedabad, Gujarat pic.twitter.com/aDkixvDB9d— ANI (@ANI) June 12, 2025మేడే కాల్ విమానంనుంచి ‘ మేడే (MAYDAY) కాల్ వచ్చిందని, కానీ ఆ తర్వాత విమానం నుండి ఎటువంటి స్పందన రాలేదు" డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అటు యూకే ప్రభుత్వం కూడా స్థానిక అధికారులతో కలిసి చేస్తోంది. ఈ మేరకు ఒక ఒక ప్రకటనవిడుదల చేసింది.. కాన్సులర్ సహాయం అవసరమైన లేదా స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల గురించి ఆందోళనలు ఉన్న బ్రిటిష్ జాతీయులు 020 7008 5000 కు కాల్ చేయాలని తెలిపింది.ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ ఫ్లైట్అవేర్ ప్రకారం, విమానం మధ్యాహ్నం 1:55 గంటలకు బయలుదేరింది - మధ్యాహ్నం 1:10 గంటలకు బయలుదేరడానికి 45 నిమిషాలు ఆలస్యంతో బయలుదేరి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూలిపోయింది. ప్రమాద స్థలం సమీపంలోని ప్రత్యక్ష సాక్షులు పెద్ద పేలుడు సంభవించి, నల్లటి పొగలు కమ్ముకున్నట్లు నివేదించారు. విమానాశ్రయానికి సమీపంలోని మేఘని నగర్ ప్రాంతం చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న శిథిలాలను దృశ్యాలు చూపించాయి. స్థానిక అగ్నిమాపక విభాగాలు, అంబులెన్స్‌లు NDRF బృందాలు సహా అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.కేంద్ర పౌర విమానయాన మంత్రి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అప్రమత్తమయ్యామని త్వరితగతిన సహాయ కార్యక్రమాలు చేపట్టినట్టు వెల్లడించారు. (అమెరికాలో వాల్‌మార్ట్‌లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్)బోయింగ్ 787 డ్రీమ్లైనర్బిజినెస్ స్టాండర్ట్ రిపోర్ట్ ప్రకారం బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ అత్యంత అధునాతన విమానాలలో ఒకటి కార్బన్ ఫైబర్-రీన్ఫోర్స్డ్ మిశ్రమాలతో నిర్మించబడింది. తక్కువ ఇంధనం పడుతుంది. అధిక తేమ స్థాయిలు, లార్డర్ డిమ్మబుల్ విండోస్, నిశ్శబ్ద క్యాబిన్ లాంటి ఫీచర్స్ దీని సొంతం. 2009లో ప్రవేశపెట్టబడిన 787-8 వేరియంట్, సాధారణంగా 242 మంది ప్రయాణికుల సామర్థ్యం ఉంటుంది. 13,500 కిలోమీటర్లకు పైగా ఎగురుతుంది. అయితే, ఈ విమానం సంవత్సరాలుగా నిరంతర సాంకేతిక, భద్రతా సమస్యలను ఎదుర్కొంటోంది.2013లో, లిథియం-అయాన్ బ్యాటరీ మంటలకు సంబంధించిన రెండు వేర్వేరు సంఘటనల తర్వాత డ్రీమ్లైనర్లను మొత్తం ప్రపంచవ్యాప్తంగా నిలిపిశారు. అందులో ఒకటి బోస్టన్‌లో జపాన్ ఎయిర్‌లైన్స్ 787, మరొకటి జపాన్‌లోని ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్కు మిడ్-ఎయిర్ ఎమర్జెన్సీ. బోయింగ్ బ్యాటరీ వ్యవస్థను పునఃరూపకల్పన చేసేవరకు యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) డ్రీమ్‌లైనర్ కార్యకలాపాలను నిలిపివేసింది.ఇదీ చదవండి: Akhil-Zainab Reception డైమండ్ నగలతో, గార్జియస్‌గా అఖిల్ అర్థాంగి2024లో, కంపెనీలో ఇంజనీర్ అయిన విజిల్‌బ్లోయర్ సామ్ సలేహ్‌పూర్ డ్రీమ్‌లైనర్ ఫ్యూజ్లేజ్లోని నిర్మాణాత్మక సమస్యల గురించి యుఎస్ సెనేట్‌కు సాక్ష్యమిచ్చిన తర్వాత బోయింగ్ తిరిగి పరిశీలనలోకి వచ్చింది. నిర్మాణ వైఫల్యానికి దారితీయవచ్చని ఆయన ఆరోపించారు. FAA దర్యాప్తు ప్రారంభించింది, అది ఇంకా కొనసాగుతోంది.- మార్చి 2024లో, LATAM ఎయిర్‌లైన్స్ బోయింగ్ 787-9 విమానం మధ్యలో అకస్మాత్తుగా సమస్యలు రావడంతో, పడిపోవడంతో 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కాక్‌పిట్‌లో సీటు-స్విచ్ పనిచేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తరువాత గుర్తించారు. దీంతో పాటు గత కొన్నేళ్లుగా డ్రీమ్‌లైనర్‌ను నడుపుతున్న పైలట్లు ఇంజిన్ ఐసింగ్, జనరేటర్ వైఫల్యాలు , ఇంధన లీకేజీలు వంటి సమస్యల గురించి వివరించారు. అయితే ఇంత ప్రమాదం మునుపెన్నడూ జరగలేదు.ఇదే ఎయిరిండియా విమానం కేవలం ఆరు నెలల క్రితం తీవ్రమైన సాంకేతిక సమస్యలను ఎదుర్కొందని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. అహ్మదాబాద్-లండన్ గాట్విక్ మార్గంలో AI-171, డిసెంబర్ 2024లో ఒక పెద్ద సాంకేతిక లోపం కారణంగా నిలిపివేశారు. ఈ సమయంలో దాదాపు 300 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. నిర్వహణ లోపాలు. విమాన భద్రతా విధానాలపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ విమానం తరువాత కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతి లభించిందట. -
అంటార్కిటికాలో దిగిన అతిపెద్ద విమానం
నార్స్ అట్లాంటిక్ ఎయిర్వేస్ అరుదైన ఘనత సాధించింది. అతి పెద్ద ప్యాసింజర్ విమానం బోయింగ్ 787ను అంటార్కిటికాలోని "బ్లూ ఐస్ రన్‌వే"పై సురక్షితంగా ల్యాండ్ చేసింది. నార్స్ అట్లాంటిక్ ఎయిర్వేస్కు చెందిన ఈ విమానం అంటార్కిటికాలోని ట్రోల్ ఎయిర్‌ఫీల్డ్‌లో దిగింది. 330 మంది ప్రయాణీకులను తీసుకెళ్లగల భారీ ఎయిర్‌క్రాఫ్ట్ అంటార్కిటికా ఖండానికి చేరుకోవడం ఇదే మొదటిసారి. "నార్స్కి ఇది ఒక చారిత్రాత్మక క్షణం. అంటార్కిటికాలో ల్యాండ్ అయిన మొట్టమొదటి బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్. ఈ ఘనతతో నార్స్ ఓ మైలురాయిని చేరింది. ఇందుకు మేము గర్వంగా భావిస్తున్నాము" అని ఎయిర్‌లైన్స్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. "ట్రోల్ ఎయిర్‌ఫీల్డ్‌లో దిగిన అతిపెద్ద విమానం. దీంతో ఒకేసారి ఎక్కువ మందిని అంటార్కిటికాకు తీసుకెళ్లగలమని భావిస్తున్నాం.' అని డైరెక్టర్ కెమిల్లా బ్రెక్కే చెప్పారు. ల్యాండింగ్‌కు సంబంధించిన వీడియోను జత చేస్తూ నార్వేజియన్ పోలార్ ఇన్స్టిట్యూట్ ట్వీట్ చేసింది. Largest aircraft ever to land on #TrollAirfield! "This demonstrates our capability of performing more effective flight operations to #Antarctica by carrying a larger scientific/logistics crew, more cargo with a smaller environmental footprint", says NPI-director, Camilla Brekke, pic.twitter.com/7vjsSw0gPI — Norsk Polarinstitutt // Norwegian Polar Institute (@NorskPolar) November 16, 2023 అంటార్కిటికాలోని క్వీన్ మౌడ్ ల్యాండ్‌లోని రిమోట్ ట్రోల్ రీసెర్చ్ స్టేషన్‌కు అవసరమైన పరిశోధన పరికరాలు, శాస్త్రవేత్తలను తీసుకెళ్లడం ఎయిర్‌లైన్ డ్రీమ్‌లైనర్ లక్ష్యం. అంటార్కిటిక్ అన్వేషణకు అవసరమైన 12 టన్నుల పరిశోధన పరికరాలను విమానంలో తీసుకెళ్లారు. నార్వేజియన్ పోలార్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలతో సహా మొత్తం 45 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే అంటార్కిటికా ఖండంలో విమానం ల్యాండ్ చేయడం సవాలుతో కూడి ఉంటుంది. ఇదీ చదవండి: దక్షిణ గాజాను వీడండి.. పాలస్తీనాకు ఇజ్రాయెల్ హెచ్చరికలు -
హైదరాబాద్–లండన్ మధ్య నాన్‌స్టాప్ ఫ్లయిట్
హైదరాబాద్: ఎయిరిండియా హైదరాబాద్– లండన్ మధ్య నాన్‌స్టాప్ విమాన సరీ్వస్‌ను ప్రారంభించింది. తొలి విమానం గురువారం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కానుంది. ఇదే విమానం తిరిగి 10వ తేదీన (శుక్రవారం) లండన్ బయల్దేరి వెళుతుంది. 256 సీట్ల సామర్థ్యం (బిజినెస్క్లాస్ 18, ఎకానమీ క్లాస్ 238 సీట్లు) కలిగిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను వారానికి రెండు సరీ్వసుల కింద ఎయిరిండియా నడపనుంది. హైదరాబాద్ నుంచి ప్రతీ సోమవారం, శుక్రవారం లండన్‌కు విమాన సరీ్వస్ ఉంటుందని ఎయిరిండియా తెలిపింది. ప్రయాణ సమయం 10.30 గంటలు. అదే లండన్ నుంచి హైదరాబాద్ మార్గంలో ప్రయాణ సమయం 9.20 గంటలుగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అమృత్సర్, కొచ్చి, అహ్మదాబాద్, గోవా విమానాశ్రయాల నుంచి లండన్‌కు ఎయిరిండియా నాన్‌స్టాప్ సరీ్వసులను నిర్వహిస్తోంది. -
130 మిలియన్ డాలర్లు.. కొనేవాళ్లు లేక తిప్పలు
మెక్సికో సిటీ: గత ప్రభుత్వాల అవినీతికి నిదర్శనంగా నిలుస్తోన్న లగ్జరీ జెట్ ‘బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్’ను అమ్మడానికి మెక్సికన్ ప్రభుత్వం ఏడాదిన్నరగా ప్రయత్నిస్తోంది. సరైన కొనుగోలుదారు కోసం ఇన్ని రోజులు ఈ లగ్జరీ జెట్‌ను అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఉంచారు. కానీ ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించి విమానాన్ని కొనడానికి ఎవరూ ఆసక్తి చూలేదు. ఈ క్రమంలో విమానాన్ని తిరిగి మెక్సికోకు రప్పించినట్లు ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ తెలిపారు. అంతేకాక ఈ లగ్జరీ విమానాన్ని మెక్సికో వాసులకే అమ్మాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో మెక్సికో నగరంలోని బెనిటో జుయారెజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్ అవుతున్న దృశ్యాలు అక్కడి టెలివిజన్ చానెల్స్‌లో ప్రసారం అయ్యాయి. 2012లో ఈ జెట్‌ను మాజీ అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత దీన్ని 80 మంది ప్రయాణించేలా పునర్నిర్మించారు. బాత్రూమ్లను పాలరాయితో నిర్మించారు. ప్రస్తుతం దీనిలో ఒక ప్రెసిడెంట్ సూట్, ప్రైవేట్ బాత్ ఉన్నాయి. (ప్రధాని కోసం ప్రత్యేక విమానం) ఐక్యరాజ్య సమితి ఈ విమానం ఖరీదును 130మిలియన్ డాలర్లుగా నిర్ణయించింది. ఇంతకంటే తక్కువ ధరకు అమ్మడానికి లోపెజ్ ఒబ్రాడోర్ ఇష్టపడకపోవడంతో ఈ లగ్జరీ జెట్‌ను కొనడానికి ఎవరు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో విమానాన్ని దక్షిణ కాలిఫోర్నియాలో ఖాళీగా ఉంచితే.. విలువ పడిపోతుందని భావించి.. తిరిగి దాన్ని మెక్సికోకు రప్పించారు. ఈ క్రమంలో ఈ నెల ప్రారంభంలో వివరాలు వెల్లడించని ఓ వ్యక్తి విమానాన్ని కొనడానికి ఆసక్తి చూపించాడని లోపేజ్ ఒబ్రాడోర్ తెలిపారు. సదరు వ్యక్తి ఈ జెట్ కోసం 120 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాడని.. ఇప్పటికే కొంత ముందస్తు చెల్లింపు కూడా చేశాడని సమాచారం. మెక్సికోలో సగం పైగా జనాభా పేదరికంలో మగ్గుతున్నారు. (మెక్సికో లేడీ డాన్ ఆఖరి క్షణాలు....) ఇలాంటి సమయంలో కరోనా ఆ దేశ పరిస్థితులను మరింత దిగజార్చింది. ఆస్పత్రుల్లో తగినన్ని ఔషధాలు అందుబాటులో లేవు. అంతేకాక కరోనా మరణాల సంఖ్యలో మెక్సికో ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో ఉంది. ఈ లాంటి పరిస్థితుల్లో ఇంత లగ్జరీ విమానం వల్ల దేశానికి ఎలాంటి లాభం లేదని భావించి దాన్ని అమ్మకానికి పెట్టింది ప్రభుత్వం. ఈ లగ్జరీ జెట్‌లో ఓ రాఫెల్ విమానం కూడా ఉన్నట్లు సమాచారం. -
ఇక విమానాల్లో సుఖ ప్రయాణం
న్యూయార్క్: ఒకప్పటితో పోలిస్తే విమాన చార్జీలు తగ్గడమే కాకుండా ప్రమాదాలు కూడా తగ్గాయి. అయినా ప్రయాణికుల ఫిర్యాదులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇరుకైన సీట్లలో సర్దుకోలేక సతమతమవడం, సీటు హ్యాండిల్‌ను తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ప్రయాణికులు ఒకరి మోచేతులను ఒకరు తోసేసుకోవడం, చంటి పిల్లల ఏడుపులను భరించలేక పోతున్నామంటూ గోల చేయడం తరచు బయటకు వినిపించే ఫిర్యాదులు. విమాన ప్రయాణ బడలికను ప్రయాణికులు అనుభవిస్తారేగానీ పెద్దగా బయటకు మాట్లాడరు. తలనొప్పి రావడం, కళ్లుతిరగడం, కళ్లు మండడం, వాంతివచ్చినట్లవడం, నోరు ఎండిపోవడం, ఊపిరాడకపోవడం, అన్నీ కలిసి భరించలేని అసహనం కలగడం, నిద్రపట్టకపోవడం లాంటి సమస్యలను వైమానిక పరిభాషలో ‘జెట్ ల్యాగ్’ అని పిలుస్తారు. కమర్షియల్ విమానంలో, ముఖ్యంగా దూరప్రాంతాలకు వెళ్లే విమానాల్లో ప్రతి ప్రయాణికుడికి ఇలాంటి సమస్యలు తప్పవు. సముద్రం లేదా నేలకు అత్యంత ఎత్తులో విమానాలు ప్రయాణిస్తాయి కనుక అంత ఎత్తులో ఉండే వాతావరణం ఒత్తిడి కారణంగా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. 3,800 అడుగులు ఎత్తులో విమానం ప్రయాణిస్తున్నప్పుడు విమానం లోపల 8,000 అడుగుల ఎత్తులో ఉండే ఒత్తిడి ప్రయాణికులపై పడుతుంది. అంటే ఎనిమిదివేల అడుగుల ఎత్తులో ఉన్న బొగోటా, కొలంబియా పర్వతాల్లో లేదా కొలరాడోలోని స్కై రిసార్ట్‌లో ఉండే వాతావరణ పరిస్థితి విమానంలో కూడా ఉంటుంది. తలనొప్పి, ఊపిరి పీల్చుకోవడం లాంటి జెట్ ల్యాగ్ సమస్యలు అక్కడికెళ్లే పర్యాటకులు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. మరి విమానాల్లో ఇలాంటి సమస్యల నుంచి విముక్తి లేదా? ఇలాంటి సమస్యలను కొత్త తరం విమానాలు ఎక్కువ వరకు అధిగమించాయి. ‘బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్, ఎయిర్‌బస్ ఏ 350’ విమానాలు ఆ కోవకు చెందినవే. వీటిలో సీట్లు విశాలంగా సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా 18 గంటలపాటు ఏక బిగినా ప్రయాణించినా ప్రయాణికులకు ‘జెట్ ల్యాగ్’ సమస్యలు పెద్దగా ఎదురుకావు. ఈ విమానాలు 3,800 అడుగుల ఎత్తులో ప్రయాణించినప్పటికీ విమానం లోపల 6000 అడుగుల ఎత్తులో ఉండే వాతావరణ పరిస్థితులే ఉంటాయి. అందుకు కారణం విమానాల నిర్మాణంలో కార్బన్‌తో బలోపేతం చేసిన తేలికైన పటిష్టమైన ప్లాస్టిక్ పరికరాలతోపాటు హైటెక్ మెటీరియల్ ఉపయోగించడమే. ఈ విమానాల్లో కావాల్సిన మేరకు తేమ ఉండడం కూడా మరో విశేషం. గాలిలో తేమను ఉత్పత్తి చేయడానికి ప్రత్యేక పరికరాలేమీ లేవు. ప్రయాణికుల శ్వాస నుంచి ఉత్పన్నమయ్యే తేమనే ఉంటుంది. మామాలు కమర్షియల్ విమానాల్లోనైతే ఈ తేమ వల్ల పరికరాలు పాడవుతాయి. మరమ్మతులు అవసరమవుతాయి. కొత్తతరం విమానాల్లో కార్బన్‌తో తయారు చేసిన ప్లాస్టిక్‌ను ఉపయోగించడం వల్ల తేమ వల్ల ప్రమాదం లేదు. అయితే ఈ కొత్త విమానాలు అన్ని దేశాలకు అందుబాటులోకి రావాలంటే మరో దశాబ్దం పాటు నిరీక్షించాల్సిందే. ఎయిర్‌బస్ ఏ 350 విమానాల కోసం ఇప్పటివరకు ప్రపంచ దేశాలు 810 అర్డర్లను మాత్రమే ఇచ్చాయి. వీటిలో 67 ఆర్డర్లు ఒక్క సింగపూర్ ఎయిర్‌లైన్స్ నుంచి వచ్చినవే. ఇక 787 విమానాల కోసం ప్రపంచ దేశాలు 1200 విమానాల కోసమే ఆర్డర్లు ఇచ్చాయి.