ఎలన్‌ మస్క్‌ పాఠశాలలో సీటు సాధించిన వరంగల్‌ విద్యార్థి..!

6th Class Student From Warangal Secured Seat In Elon Musk School - Sakshi

6th Class Student From Warangal Secured Seat In Elon Musk School: పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదే కాబోలు చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభతో సత్తా చాటాడు వరంగల్‌కు చెందిన ఓ విద్యార్థి. ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతూ...కంప్యూటర్ కోడింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, పైథాన్‌ లాంగ్వేజ్‌లో పట్టు సాధించి ఏకంగా ఎలన్‌ మస్క్‌ స్థాపించిన సింథసిస్‌ స్కూల్‌లో అనిక్‌ పాల్‌ అడ్మిషన్‌ సాధించాడు. 

అనిక్‌ పాల్ తండ్రి విజయ్‌పాల్ వృత్తిరీత్యా ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఎలన్ మస్క్ స్థాపించిన సింథసిస్ స్కూల్ గురించి తెలుసుకున్న విజయ్‌పాల్... తన కుమారుడిని ఎలాగైనా అందులో చేర్పించాలని నిశ్చయించుకున్నారు. అందుకు సరిపడా​ శిక్షణను అనిక్‌ ‌కు అందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అనిక్‌ పాల్ కంప్యూటర్ కోడింగ్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, మెషీన్ లెర్నింగ్‌లో ప్రావీణ్యం సాధించాడు.


 

మూడు రౌండ్లను అలవోకగా..!
ఎలన్‌ మస్క్‌ స్థాపించిన సింథసిన్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షలోని మూడు రౌండ్లను అనిక్‌ ‌ పాల్‌ అలవోకగా సాధించాడు. ప్రవేశ పరీక్షలో భాగంగా మొదటి రౌండ్‌లో పిల్లలు ఆడే వీడియో గేమ్స్‌కు సంబంధించిన పలు లాజికల్ ప్రశ్నలను అనిక్‌ పాల్ ఇట్టే  పరిష్కరించాడు. రెండో రౌండ్‌లో సింథసిస్ స్కూల్ బోర్డు ఇచ్చిన ఓ ప్రశ్నకు వివరణాత్మక సమాధానంతో కూడిన వీడియోను రూపొందించి పంపగా అందులో సెలక్ట్‌ అవ్వగా...మూడో రౌండ్‌లో పర్సనల్ ఇంటర్వ్యూ లోనూ సత్తా చాటాడు. దీంతో అనిక్‌ పాల్‌కు సింథసిస్ స్కూల్లో సీటు ఖరారైంది. ప్రస్తుతం అనిక్‌ ‌ పాల్‌ ఆన్‌లైన్‌ క్లాసులను వింటున్నట్లు తెలుస్తోంది. 

సింథసిస్ స్కూల్ ప్రత్యేకతలివే
ఎలన్ మస్క్, జోష్ డాన్‌తో కలిసి ఆరేళ్ల క్రితం సింథసిస్ స్కూల్‌ను స్థాపించారు. ప్రస్తుతమున్న స్కూళ్లన్నింటి కంటే విభిన్నంగా కరిక్యులమ్, యాక్టివిటీస్ సింథసిస్‌లో ఉంటాయి. ఈ స్కూల్లో క్లాస్ రూమ్ బోధన కంటే ప్రాక్టికల్స్, ప్రయోగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.కొత్త ఆవిష్కరణల దిశగా ప్రయోగాలు, వ్యూహాత్మక ఆలోచన విధానం, క్రియేటివ్ యాక్టివిటీస్‌ను విద్యార్థులకు నేర్పిస్తారు. గతంలో స్పేస్ఎక్స్‌ కంపెనీలో పనిచేసే వ్యక్తుల కుటుంబాలకు మాత్రమే ఈ స్కూల్లో అడ్మిషన్స్ ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏ మారుమూల విద్యార్థి అయిన తమ టాలెంట్‌తో ఇందులో సీటు సాధించే అవకాశాన్ని కల్పించారు.

చదవండి: స్పైడర్‌మ్యాన్‌ క్రేజ్‌..! మార్కెట్లలోకి సూపర్‌ హీరోస్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ స్కూటర్స్‌..! చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top