Suzuki Burgman 2022: వచ్చేస్తోంది..సుజుకి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌...రేంజ్‌ ఏంతంటే..?

2022 Suzuki Burgman Electric Scooter Spotted During Road Tests Details Here - Sakshi

ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. అనేక కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల, బైక్‌లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్లలో టీవీఎస్‌, బజాజ్‌, ఒలా ఎలక్ట్రిక్‌, ఏథర్‌ వంటి కంపెనీలు పాతుకుపోయాయి. వీటికి పోటీగా ప్రముఖ జపనీస్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం సుజుకి మోటార్‌ సైకిల్‌ ఇండియా ఎలక్ట్రిక్‌ స్కూటర్లను లాంచ్‌​ చేసేందుకు సిద్దమైంది. తాజాగా సుజుకి త్వరలోనే లాంచ్‌ చేయనున్న  ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బర్గ్‌మాన్‌ ఈవీ ప్రోటోటైప్‌కు సంబంధించిన చిత్రాలు  ఇటీవల వైరల్‌గా మారాయి.

సుజుకీ ఎలక్ట్రిక్ స్కూటర్ బర్గ్‌మాన్ 125కు ఎలక్ట్రిక్ వెర్షన్‌ రానుంది.  సుజుకిలో  బెస్ట్‌ సెల్లింగ్‌ స్కూటర్లలో బర్గ్‌మాన్ స్ట్రీట్ 125 నిలిచింది. దీన్నే ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ స్కూటర్‌గా లాంచ్‌ చేయనుంది సుజుకి. మీడియా నివేదికల ప్రకారం...డ్యూయల్‌ టోన్‌ కలర్స్‌లో లాంచ్‌ కానుంది. బ్లూ, వైట్‌ కలర్‌ వేరియంట్స్‌లో రానుంది. స్కూటర్‌ వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు, లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో రానున్నట్లు తెలుస్తోంది. 

ఫీచర్స్‌ విషయానికి వస్తే..!
సుజుకి బర్గ్‌మాన్‌ స్ట్రీట్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో...బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, USB ఛార్జర్, ఫుల్-LED హెడ్‌లైట్, పెద్ద సీట్ స్టోరేజ్‌తో అప్‌డేట్ చేయబడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను వచ్చే అవకాశం ఉంది.

రేంజ్‌ ఏంతంటే..!
సుజుకి బర్గ్‌మాన్‌ స్ట్రీట్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ సంబంధించిన పవర్‌ట్రెయిన్, ఇతర సాంకేతిక వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే బర్గ్‌మ్యాన్ ఎలక్ట్రిక్ 3-4kWh బ్యాటరీ ప్యాక్,  4-6kWh ఎలక్ట్రిక్ మోటారుతో రానుంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 80 నుంచి 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని సమాచారం. భారత్‌లో అధికారిక లాంచ్ 2022 తర్వాత జరగవచ్చునని తెలుస్తోంది. 

చదవండి: ఎలక్ట్రిక్‌ బైకులకు ఎండాకాలం ఎఫెక్ట్‌.. ఉన్నట్టుండి తగలబడి పోతున్నాయ్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top