సమష్టి కృషితో లక్ష్యం దిశగా అడుగులు
జిల్లాలో ఆదర్శంగా నిలుస్తున్న పూబెల్లి
ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
అవగాహన కల్పించాం
ఇల్లెందురూరల్: పూబెల్లి గ్రామం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మోడల్ గ్రామంగా ఎంపికై పూరిగుడిసె లేని గ్రామంగా రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలోనే గ్రామస్తులు ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, పంచాయతీ జిల్లాలో ఆదర్శంగా నిలుస్తోంది. మండలంలోని పూబెల్లి గ్రామపంచాయతీ పరిధిలో 186 గృహాలు ఉన్నా యి. గతంలో 106 ఇళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించుకున్నారు. తాజాగా మోడల్ గ్రామం పేరుతో నిర్మి తమైన ఇందిరమ్మ ఇళ్ల ఆవరణలో వీబీజీ రామ్‌జీ పథకంలో భాగంగా 80 ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ఇంకుడు గుంతకు రూ.6,500 చొప్పున లబ్ధిదారులకు చెల్లిస్తున్నారు. ముందస్తుగా మంజూరైన 50 ఇంకుడు గుంతలలో సోమవారం నాటికి 45 నిర్మాణాలు పూర్తి చేశారు. మిగిలిన ఐదు నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి.
సమష్టి కృషితో..
సర్పంచ్ మచ్చ సాయమ్మ, కార్యదర్శి బాలకృష్ణ లబ్ధిదారులతో గ్రామకూడలిలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, ఇంకుడు గుంతల వల్ల కలిగే ప్రయోజనంపై అవగాహన కల్పించారు. మేసీ్త్రలు, ట్రాక్టర్ యజమానులతో మాట్లాడి సిమెంట్ హౌస్ ల తయారీ, గుంతలో వేసేందుకు అవసరమైన రాళ్లను తోలేందుకు గ్రామస్తుల సమక్షంలోనే తగ్గింపు ధర నిర్ణయించారు. దీంతో లబ్ధిదారులు అందరూ గుంతల నిర్మాణం చేపట్టారు. పూబెల్లిలో సిరిగుండం, తొట్లగుండం జలపాతాలు ఏడాదంతా పర్యాటకులను ఆహ్లాదపరుస్తుంటాయి. ప్రతీ ఇంట్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపడుతుండటంతో గ్రామానికి ఆనుకునే వ్యవసాయ బోర్లు కూడా జలసిరిని అందుకుంటాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పూబెల్లి గ్రామపంచాయతీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తులు, అధికారులు, వార్డు సభ్యులతో సమష్టిగా కృషి చేస్తున్నాం. తాజా గా మంజూరైన ఇంకుడు గుంతల నిర్మాణం నిర్దేశిత గడువుకు ముందే పూర్తి చేశాం.
– మచ్చ సాయమ్మ,
సర్పంచ్, పూబెల్లి, ఇల్లెందు మండలం
గ్రామంలో నీటి ఎద్దడి రాకుండా తక్షణం చేయాల్సి న పనులపై గ్రామస్తులకు అవగాహన కల్పించాం. దీంతో గ్రామంలోని ప్రతీ ఇంట్లో ఇంకుడు గుంత నిర్మాణం ప్రారంభమైంది. సమష్టిగా శ్రమించి నిర్మాణ లక్ష్యాన్ని గడువుకు ముందే చేరుకున్నాం.
– రేళ్ల బాలకృష్ణ,
కార్యదర్శి, పూబెల్లి, ఇల్లెందు మండలం


