● తెలంగాణ నుంచే 24 గంటల వ్యవసాయ విద్యుత్ సరఫరా ● ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
భద్రాచలంఅర్బన్: రాష్ట్ర విభజన అనంతరం 12 ఏళ్లుగా విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భద్రాచలం ప్రాంత రైతుల ఇక్కట్లు ఎట్టకేలకు తొలగిపోయాయి. పట్టణంలోని కూనవరం రోడ్డు పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ విద్యు త్ కనెక్షన్లకు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లోని పురుషోత్తపట్నం సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అవుతోంది. తెలంగాణ నుంచే విద్యుత్ సరఫరా చేయాలని రైతులు పలుమార్లు ఆందోళనలు చేపట్టడంతోపాటు అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి కూనవరం రోడ్డు వరకు ప్రత్యేక వ్యవసాయ విద్యుత్ లైన్ ఏర్పాటు చేశారు. వ్యవసాయ కనెక్షన్లకు అనుసంధానించారు. శనివా రం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ సరఫరాను ప్రారంభించారు. ఇకపై రైతులకు తెలంగాణ నుంచే విద్యుత్ అందనుంది. సర్పంచ్ పూనం కృష్ణదొర, విద్యుత్‌శాఖ డీఈ కె.జీవన్‌కుమార్, ఇతర అధికారులు నరసింహారావు, రాజారావు, వెంకటరాజు, రామకృష్ణ, రమేష్, శ్రీను, ఉదయ రత్నకుమార్, త్రినాథ్‌రెడ్డి, జగదీష్‌బాబు పాల్గొన్నారు.


