నేడు మంత్రి పొంగులేటి పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

Nov 29 2026 1:47 PM | Updated on Nov 29 2026 1:47 PM

ఖమ్మంమయూరిసెంటర్‌: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఖమ్మంలో జరిగే వివిధ కుల సంఘాల వన సమారాధన వేడుకలకు హాజరవుతారు. మధ్యాహ్నం 3–45 గంటలకు ఖమ్మం శాంతినగర్‌ పాఠశాలలో జరిగే శతాబ్ది ఉత్సవాల్లో మంత్రి పాల్గొంటారు. అనంతరం రాత్రి 7గంటలకు భద్రాద్రి జిల్లా ఇల్లెందు సింగరేణి మైదనాంలో జరిగే మహా రుద్రాభిషేకంలో మంత్రి పొంగులేటి పాల్గొంటారని క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్‌ తుంబూరు దయాకర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

సకాలంలో వైద్య సేవలు అందించాలి

జూలూరుపాడు/కరకగూడెం: బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని 108 ఈఎంఈలు మనోహర్‌, సతీష్‌ సూచించారు. శనివారం కరకగూడెం, పినపాక, జూలూరుపాడు మండలాల్లో 108, 102 అత్యవసర సేవల వాహనాలను తనిఖీ చేశారు. వాహనాల నిర్వహణ, సిబ్బంది పనితీరు, సేవలపై ఆరా తీశారు. అత్యవసర సమయాల్లో వాహనాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రాజెక్టు మేనేజర్‌ నజీరుద్దీన్‌, పైలట్లు అప్పిరెడ్డి, అజయ్‌, పాషా, సాయి, నరేందర్‌ కుమార్‌, ఈఎంటీలు పద్మావతి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

అచ్యుతాపురంవాసికి డాక్టరేట్‌

అశ్వారావుపేటరూరల్‌: మండలంలోని అచ్యుతాపురానికి చెందిన చాట్ల అరుణజ్యోతి జేఎన్‌టీయూ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ఆమె కేన్సర్‌ వ్యాధి నిరోధక, శిలీంద్ర నాశక కారకాలను విశ్లేషించి వ్యాధి నివారణలో తోడ్పడే సమ్మేళనాలను ఔషధాలుగా మార్చేలా పరిశోధనలు చేశారు. ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు పర్యవేక్షణలో ‘బయాలజికల్‌ ఎవల్యూషన్‌ ఆఫ్‌ నావెల్‌ హెటిరో సైక్లిక్‌ పెండెంట్‌ క్వినోజోలినోన్‌ ఇండోల్‌ పైరోజోల్‌ డెరివేటివ్స్‌’ అనే అంశంపై పరిశోధనా గ్రంథాన్ని యూనివర్సిటీకి సమర్పించారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌ తిరుమలాచారి డాక్టరేట్‌ అందజేశారు. ఈ సందర్భంగా పలువురు అభినందించారు.

కణుజు మృతి కేసు

చాతకొండ రేంజ్‌కు బదిలీ

పాల్వంచరూరల్‌: దాహం తీర్చుకునేందుకు కిన్నెరసాని బ్యాక్‌ వాటర్‌ వద్దకు రెండు రోజుల క్రితం వచ్చిన కణుజు చేపల కోసం పెట్టిన వలలో చిక్కుకోగా వేటగాళ్లు చంపిన కేసును చాతకొండ రేంజ్‌కు బదిలీ చేశారు. కిన్నెరసాని అభయారణ్యం పరిధి మందరేకలపాడు సమీపాన కణుజును వేటగాళ్లు హతమార్చినట్లు గుర్తించగా, ఎనిమిది మందిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు మ్యాప్‌ ద్వారా పరిశీ లించిన అధికారులు ఘటన చండ్రాలగూడెం బీట్‌ చాతకొండ రేంజ్‌ పరిధిలో జరిగినట్లు తేలడంతో కేసును యానంబైల్‌ రేంజ్‌ నుంచి శని వారం బదిలీ చేశారు. కాగా, వన్యప్రాణి మాంసం శాంపిళ్లను హైదరాబాద్‌లోని సీసీఎంబీ కార్యాలయానికి పంపించగా, మాంసం కణుజుదా లేక ఇతర జంతువుదా అనేది నివేదిక వస్తే వెల్లడవుతుందని అధికారుల తెలిపారు. కాగా, టాస్క్‌ఫోర్‌ డీఆర్వో సాలూజ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులు 8 మందిని రిమాండ్‌కు తరలించారు.

10 బైక్‌లు సీజ్‌

టేకులపల్లి: మండలంలోని గోలియాతండా గ్రామ పంచాయతీ పరిధి బి కాలనీ తండాలో శనివారం పోలీసులు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. తండాలోని ప్రతీ ఇంటిని తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 10 బైక్‌లను సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఇల్లెందు డీఎస్పీ యు.వెంకన్నబాబు మాట్లాడు తూ శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసమే కార్డన్‌సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సైబర్‌నేరాల పట్లఅప్రమత్తంగా ఉండాలని, గంజాయి, గుడుంబా వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలన్నారు. సీఐలు బత్తుల సత్యనారాయణ, తిరుపతి, ఎస్సైలు తిరుపతి, సోమేశ్వర్‌, నాగుల్‌ మీరా, సారంగపాణి, ఇల్లెందు సబ్‌ డివిజన్‌ పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement