కొత్తగూడెంఅర్బన్/దుమ్ముగూడెం: బీఈడీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు స్వర్ణపతకాలు ప్రదానం చేశారు. శనివారం హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ చాన్సలర్ శివ ప్రతాప్ శుక్లా అందజేశారు. కొత్తగూడెం బాబూక్యాంప్ ప్రాంతానికి చెందిన, సింగరేణి ఉద్యోగి గోపికృష్ణ సతీమణి ఎలుపుల శివాని మూ డు బంగారు పతకాలు సాధించింది. బి.ఎడ్ పరీక్షలో అధిక మార్కులు సాధించడం, కాకతీయ విశ్వవిద్యాలయ స్థాయిలో ప్రథమ ర్యాంకు పొందడం, పెడగాజీ ఆఫ్ సోషల్ సైన్సెస్ విభాగంలో అత్యుత్తమ మార్కులు సాధించడంతో మూడు పతకాలు అందజేశారు. దుమ్ముగూడెం మండలంలోని గౌరా రం గ్రామానికి చెందిన ఇరప సుశీల కూడా అధిక మార్కులు సాధించి, రాష్ట్ర గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా గోల్డ్‌మెడల్ అందుకుంది. సుశీల భద్రాచలం ఏజెన్సీ బీఈడీ కళాశాల నుంచి విద్యనభ్యసించారు. ఈ సందర్భంగా పతకధారులను పలువురు అభినందించారు.
ఎంఏ ఎకానమిక్స్‌లో దుర్గాభవానికి..
పాల్వంచ రూరల్: మండలంలోని యానంబైల్ గ్రామానికి చెందిన యర్రంశెట్టి సత్యనారాయణ, స్వరూపారాణి దంపతుల కుమార్తె దుర్గాభవాని ఉన్నత విద్యలో ప్రతిభ కనబరిచి గోల్డ్‌మెడల్ కై వసం చేసుకుంది. ఎంఏ ఎకనామిక్స్ విభాగంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రథమ స్థానంలో నిలిచింది. శనివారం జరిగిన వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా గోల్డ్‌మెడల్‌తోపాటు ప్రశంసపత్రాన్ని అందుకుంది. ఆమెను తల్లిదండ్రులతోపాటు మాజీ జెడ్పీటీసీ యర్రంశెట్టి ముత్తయ్య అభినందించారు.


