●సీసీఎల్‌ఏ అసిస్టెంట్ డైరెక్టర్ మాలతి
సూపర్‌బజార్(కొత్తగూడెం): భూ రీసర్వే ప్రక్రియ ను పారదర్శకంగా నిర్వహించాలని సీసీఎల్‌ఏ అసిస్టెంట్ డైరెక్టర్ మాలతి సూచించారు. జిల్లా రెవె న్యూ అధికారి పద్మావతి అధ్యక్షతన శనివారం కలెక్టరేట్‌లో మండల సర్వేయర్లు, గ్రామ పాలనా కార్యదర్శులు, మండల తహసీల్దార్లకు రీ సర్వేప్రక్రియపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ వెబ్ పోర్టల్‌లో మండల సర్వేయర్ లాగి న్ ద్వారా సర్వే నంబర్లను క్షేత్రస్థాయిలో సర్వే చేసే విధానం, సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, జీపీఓ లాగిన్ ద్వారా సంబంధిత ప్రక్రియలను పూర్తిచేసే విధానాలపై వివరించారు. వివిధరకాల ల్యాండ్ పార్సెల్ మ్యాప్స్ జనరేషన్, తయారీ విధానం, పోర్టల్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రాక్టికల్ శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సర్వే ఆఫీస్ అసిస్టెంట్ డైరెక్టర్, జిల్లా రీసర్వే జోనల్ అధికారి పి శ్యామ్ సుందర్ రెడ్డి, ఏడీ సర్వే శ్రీనివాస్, ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


