వేతనాలు పెంచాలని.. | - | Sakshi
Sakshi News home page

వేతనాలు పెంచాలని..

Jun 30 2026 12:54 AM | Updated on Jun 30 2026 12:54 AM

● సింగరేణి అధికారుల ఆందోళన ● ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు ● ఎమ్మెల్యే కూనంనేని సంఘీభావం

పెన్‌డౌన్‌ చేస్తాం

● సింగరేణి అధికారుల ఆందోళన ● ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు ● ఎమ్మెల్యే కూనంనేని సంఘీభావం

రుద్రంపూర్‌: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న సుమారు 2,400 మంది అధికారులు పది రోజులు గా పే అప్‌గ్రేడేషన్‌ కోసం ఆందోళనలు నిర్వహిస్తున్నారు. నల్లబ్యాడ్జీలు, ప్ల కార్డులతో నిరసన తెలిపా రు. సోమవారం సింగరేణి వ్యాప్తంగా ఉన్న జీఎం కార్యాలయాల ఎదుట నిరసన దీక్ష ప్రారంభించారు. సమస్యలు పరిష్కరించాలని 60సార్లు సింగరేణి సీఎండీ, డైరెక్టర్లు, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు వినతి పత్రాలు అందజేసినా స్పందించకపోవడంతో ఆందోళనలు చేపడుతున్నట్లు కోల్‌మైన్స్‌ ఆఫీ సర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఎంఓఏఐ) సింగరేణి శాఖ బాధ్యులు తెలిపారు.

నిర్లక్ష్యం వీడని యాజమాన్యం

వేతనాల్లో అసమానతలు ఉండటంలో కోలిండియా అధికారులు కోర్టుకు వెళ్లారు. దీంతో వేతనాలు పెంచి, అసమానతలు తొలగించాలని న్యాయస్థానం తీర్పుఇచ్చింది. దీంతో ఈ–1 గ్రేడ్‌ అధికారులకు రూ. 60 వేలు, ఈ–2 నుంచి ఈ–6 అధికారులకు కూడా బేసిక్‌ వేతనం పెంచుతూ కోలిండియా నిర్ణయం తీసుకుంది. కోలిండియాలో జనవరి 2026 నుంచి పెంచిన వేతనం అమల్లోకి రాగా, సింగరేణి సంస్థలో మాత్రం అమలు చేయడం లేదు. పలుమార్లు విన్నవించగా సీఎండీ బుద్ధప్రకాశ్‌ జ్యోతి వేతనాల పెంపుపై కమిటీ చేశారు. ఆ కమిటీ నివేదిక ఇచ్చినా వేతనాలు మాత్రం పెంచలేదని అధికారులు ఆరోపిస్తున్నారు. ఇక గత మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పీఆర్‌పీ (పెర్ఫార్మెన్స్‌ రిలేటెడ్‌ పే) నగదు రూ. 277 కోట్లు పెండింగ్‌లో ఉంది. నగదు కేటాయించినా చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని, కోలిండియాలో చెల్లించినా, సింగరేణిలో చెల్లించడం లేదని అధికారులు ఆరోపిస్తున్నారు. నాలుగో పీఆర్సీ అమలుకు ముందే పే అప్‌గ్రేడేషన్‌ చేయాలని కోరుతున్నారు.

ప్రధాన కార్యాలయం ఎదుట దీక్షలు

కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట అధికారులు సోమవారం దీక్ష చేపట్టారు. సంస్థవ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయాల వద్ద ఆందోళనలు ప్రారంభించారు. కొత్తగూడెంలో దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి వీడి, అధికారుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. మేయర్‌ మూడ్‌ గణేష్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌షాపా, నాయకులు వంగా వెంకట్‌, జే.గట్టయ్య, క్రిష్టాఫర్‌ పాల్గొన్నారు.

రెండున్నరేళ్లుగా కేంద్ర, రాష్ట్ర మంత్రులకు వినతి పత్రాలు అందజేస్తున్నాం. యాజమాన్యం, ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. అయినా పట్టించుకోకపోవడంతో ఆందోళనలు నిర్వహిస్తున్నాం. సోమవారం నుంచి సింగరేణివ్యాప్తంగా నిరసన దీక్షలు చేపడుతున్నాం. అప్పటికీ యాజమాన్యం స్పందించకపోతే పెన్‌డౌన్‌ కూడా చేస్తాం.

–లక్ష్మీపతి గౌడ్‌,

సీఎంఓఏఐ సింగరేణి శాఖ అధ్యక్షుడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement