జగదభిరాముడికి జ్యేష్ఠ్యాభిషేకం | - | Sakshi
Sakshi News home page

జగదభిరాముడికి జ్యేష్ఠ్యాభిషేకం

Jun 30 2026 12:54 AM | Updated on Jun 30 2026 12:54 AM

ఏరువాక పౌర్ణమి సందర్భంగా

ప్రత్యేక పూజలు

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జ్యేష్ట మాస పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం జగదభి రాముడికి జ్యేష్ఠాభి షేకం కనుల పండుగా జరిపారు. తొలుత బేడా మండపంలో ఏర్పాటు చేసిన 81 కలశాలలో సమస్త నదీ జలాలను ఆవాహన చేశారు. అనంతరం స్వామివారికి పంచామృతంతో అభిషేకం, నదీజలాలతో జ్యే ష్ఠ్యాభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత స్వామి వారికి హారతి సమర్పించారు. కాగా జ్యేష్ఠ్యాభిషేకాన్ని పురస్కరించుకుని సోమవారం రద్దు నిత్యకల్యాణం రద్దు చేయగా, మంగళవారం నుంచి యథావిధిగా కొనసాగించనున్నారు. ఆలయ ఈఓ దామోదర్‌రావు, ప్రధాన అర్చకులు విజయరాఘవన్‌, కోటి రామస్వరూప్‌, ఇతర అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా

చండీహోమం పూజలు

పాల్వంచరూరల్‌: పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో సోమవారం చండీ హోమం, పంచామృతాభిషేకం నిర్వహించారు. ముందుగా మేళతాళాలు, వేదమంత్రాలతో స్వామివారిని అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మండపారా ధన, గణపతిపూజ, చండీహోమం జరిపారు. చివరన పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజలో పాల్గొన్న 25 మంది భక్త దంపతులకు అర్చకులు రమేష్‌, అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను అందజేశారు.

డీఎఫ్‌ఓగా

సిద్ధార్థ్‌ విక్రమ్‌ సింగ్‌

చుంచుపల్లి: జిల్లా అటవీశాఖ అధికారిగా సిద్ధార్థ్‌ విక్రమ్‌ సింగ్‌ నియ మితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన బదిలీపై నిజామాబాద్‌ నుంచి ఇక్కడకు రానున్నారు. ఇప్పటివరకు పనిచేసిన డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్‌ను జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు బదిలీ చేశారు. కాగా, సిద్ధార్థ్‌ విక్రమ్‌ సింగ్‌ గతంలో ఖమ్మం డీఎఫ్‌ఓగా పనిచేశారు.

పెద్దపులి సంచారం

దుక్కిటెద్దుపై దాడి

అశ్వారావుపేటరూరల్‌: మండలంలోని కావడిగుండ్ల గ్రామ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరించింది. ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన రైతు తెల్లం భీమరాజు దుక్కిటెద్డుపై దాడి చేసి చంపింది. గ్రామాల సమీపంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు జీపీఎస్‌ సిగ్నల్‌ ద్వారా గుర్తించడంతోపాటు పశువులపై దాడి చేయడంతో స్థానికులు భయందోళన చెందుతున్నారు. ఫారెస్టు రేంజర్‌ మురళి ఆధ్వర్యంలో సిబ్బంది అటవీ ప్రాంతాల్లో పులి పాదముద్రలు గుర్తించి, కదలికలు పట్ల చుట్టుపక్కల గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నా రు. పెద్దపులి తిరిగి వెళ్లే వరకు రైతులు, గ్రామస్తులు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని, జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్‌ రేంజర్‌ సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement