పథకాలను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

Jun 30 2026 12:54 AM | Updated on Jun 30 2026 12:54 AM

వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం

వహించొద్దు

ఐటీడీఏ పీఓ రాహుల్‌

భద్రాచలం/భద్రాచలంటౌన్‌: ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి బి.రాహుల్‌ అన్నారు. సోమవారం ఐటీడీఏలో జరిగిన గిరిజన దర్బార్‌లో గిరిజనుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. పరి శీలించి, సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్‌ చేశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ గిరిజ నులు సమర్పించిన అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు.

పీఓకు సత్కారం

ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ను ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సన్మానించారు. సోమవారం ఐటీడీఏలో పీఓ రెండేళ్లపాలన సక్సెస్‌ మీట్‌ నిర్వహించా రు. ఈ సందర్భంగా పీఓను ఎమ్మెల్యే శాలువా సత్కరించి, పీఓ సాధించిన ప్రగతి పోస్టర్లు ఆవిష్కరించారు. విధుల్లో పీఓ తీరు అభినందనీ యమని అన్నారు.

గడువులోగా ఎన్యుమరేషన్‌ పూర్తి చేయాలి

ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ గడువులోగా పూర్తిచేయాలని పీఓ బి.రాహుల్‌ అధి కారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్‌ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు ఆయన ఐటీడీఏ కార్యాలయం నుంచి హాజరయ్యారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. బూర్గంపాడు, మణుగూరు, అశ్వాపురం మండలాల్లో పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశించారు.

మెరుగైన వైద్య సేవలు అందించాలి

ఏజెన్సీలోని మారుమూల గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో మారుమూల పీహెచ్‌సీల వైద్యాధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరద ముంపు గ్రామాల్లోని గర్భిణులపై ప్రత్యేక దృష్టి పెట్టా లని,నార్మల్‌ డెలివరీల శాతం పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. టీబీ పరీక్షలు జరపాలని, రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులను భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోని ఎన్‌ఆర్‌సీకి తరలించాలనిసూచించారు. ఈ కార్యక్రమాల్లో ఏపీఓ డేవిడ్‌ రాజ్‌, డీఎంహెచ్‌వో తుకారం రాథోడ్‌,డీసీహెచ్‌ఎస్‌ రవిబాబు, ఇతర అధికారులు ఆనంద్‌కుమార్‌, అశోక్‌, మధుకర్‌, సైదులు, సమ్మయ్య, రాంబాబు, ఉదయ్‌ కుమార్‌ వేణు, గన్యా, మనిధర్‌, హేమంత్‌, నరేష్‌, రామకృష్ణ, సూర్య ప్రకాష్‌, అనూష, లీలావతి, భద్రాచలం సర్పంచ్‌ పూనెం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement