కొత్తగూడెంఅర్బన్: బాలల సంరక్షణకు అన్ని విభా గాలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. జూలై 1 నుంచి నెలరోజులపాటు ఆపరేషన్ ముస్కాన్–12వ విడత కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకోసం సోమవారం ఎస్పీ కార్యాలయంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, చైల్డ్ హెల్ప్ లైన్1098, కై లాష్ సత్యర్థి చిల్డన్ర్ ఫౌండేషన్ ఎన్జీవో, విద్యాశాఖ, వైద్యశాఖ, కార్మిక శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. తప్పిపోయిన, భిక్షాటన చేస్తున్న, నిరాదరణ గురైన పిల్లలను, బాలకార్మికులను సంరక్షించాలన్నారు. ముస్కాన్ కోసం ప్రత్యేకంగా పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తొలుత ఆపరేషన్ ముస్కాన్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మల్లేష్ స్వామి, లెనినా స్వర్ణలత, హరి కుమారి, శ్రీనివాస్, రాము, నాగరాజు, యేసుపాదం, సైదులు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్ రాజు


