సత్తుపల్లిటౌన్: కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తాకడంతో షాక్‌కు గురైన ఓ వ్యక్తి మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లం గ్రామానికి చెందిన రెడ్డిపోగు వెంకటేశ్వరరావు(40) సోమవారం ట్రక్ లారీపై జేసీబీని తీసుకుని వస్తున్నాడు. ఈక్రమాన పైన కూర్చున్న ఆయనకు సత్తుపల్లి మండలం చెరుకుపల్లి వద్ద నీలాద్రి రోడ్డులో నుంచి కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు తాకగా షాక్‌కు గురై స్పృహ కోల్పోయాడు. ఈమేరకు వెంకటేశ్వరరావును సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతున్న మహిళ ..
ఇల్లెందురూరల్: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన ధనసరి ప్రభాకర్, స్వప్న దంపతులు ఈ నెల 27న బైక్‌పై ఇల్లెందుకు వస్తుండగా రొంపేడు వద్ద ఎదురుగా వచ్చిన గేదెను ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, స్వప్న సోమవారం మృతిచెందింది. ప్రభాకర్‌కు చికిత్స అందిస్తున్నారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ సురేష్ తెలిపారు.


