అశ్వారావుపేటరూరల్: పార్కింగ్ చేసి ఉన్న ఓ ఆటోను చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీఐ పి.నాగరాజు రెడ్డి కథనం ప్రకారం.. పట్టణంలోని భద్రాచలం రోడ్‌లో ఉన్న శ్రీశ్రీ ఫంక్షన్ హాల్ వద్ద ఈ నెల 23న అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడేనికి చెందిన మహంకాళి వెంకటేష్ ఆటో పార్కింగ్ చేయగా, చోరీకి విచారణ చేపట్టారు. దీంతో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన ఎస్‌ఐ టీ యాయతీ రాజు విచారణ చేపట్టారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఎస్‌కే రహీం అనే వ్యక్తి వద్ద ఉన్నట్లు గుర్తించి ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఎస్‌కే రహీంను అరెస్ట్ చేశారు.


