సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సత్వరమే పరిష్కరించాలి

Jun 30 2026 12:54 AM | Updated on Jun 30 2026 12:54 AM

పొరపాట్లకు తావివ్వొద్దు

కొత్తగూడెంఅర్బన్‌: ప్రజావాణిలో అందించిన వినతులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ అంకిత్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌తో కలిసి ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పరిశీలించి సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రజా వాణి కార్యక్రమాన్ని ప్రజల సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన వేదికగా వినియోగించుకోవాలని తెలిపారు. శాఖల మధ్య సమన్వయం ఉంటే సమస్యల పరిష్కారం వేగవంతమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజావాణి దరఖాస్తుల్లో కొన్ని ఇలా...

● డబుల్‌బెడ్‌ రూం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రుద్రంపూర్‌ గ్రామపంచాయతీ ప్రజ లు విన్నవించగా, కలెక్టర్‌ పరిశీలించి సంబంధిత ఎంపీడీఓకు ఎండార్స్‌ చేశారు.

● ఉద్యోగ అవకాశం కల్పించాలని పాల్వంచ మండలం సీతారాంపట్నానికి చెందిన యానబోయి న మౌనిక అర్జీ అందించగా, తగిన చర్యల నిమి త్తం జిల్లా ఉపాధి కల్పనాధికారికి అప్పగించారు.

● అశ్వాపురం మండలం మొండికుంటలో రూ. 1.50 కోట్లతో 2023లో ప్రారంభించిన డ్రెయినేజీ పనులు పూర్తికాలేదని గ్రామ సర్పంచ్‌ విన్నవించగా, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు.

● తన తండ్రి జక్కం కృష్ణమూర్తి పేరుపై ఉన్న 4 ఎకరాల 27కుంటల భూమిని వారసత్వంగా తన పేరుపై మార్చి పట్టాదారు పాస్‌బుక్‌ మంజూరు చేయాలని బూర్గంపాడుకు చెందిన జక్కం శ్యామ్‌ విన్నవించగా, బూర్గంపాడు తహసీల్దార్‌కు ఎండార్స్‌ చేశారు.

● మణుగూరు మున్సిపాలిటీ చట్టపల్లి ప్రాంతంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలపై చర్యలు తీసుకోవాలని స్థానికు డు లింగాల సాయికుమార్‌ ఫిర్యాదు చేయగా, ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారికి ఎండార్స్‌ చేశారు.

ఉద్యోగులకు సన్మానం

కొత్తగూడెంఅర్బన్‌: ఉద్యోగ విరమణ పొందునున్మన కె. సంజీవరావు (సీపీఓ), డాక్టర్‌ వెంకటేశ్వర్లు (డీవీఏహెచ్‌ఓ), చి. రమేష్‌బాబు (అసిస్టెంట్‌ ఇంజనీర్‌, హౌసింగ్‌), అంజనేయులు (ఆఫీస్‌ సబార్డినేట్‌, హౌసింగ్‌ శాఖ)లను సోమవారం కలెక్టర్‌ అంకిత్‌ ఐడీఓసీలో సన్మానించారు. అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

గడువులోగా పూర్తి చేయాలి

కొత్తగూడెంఅర్బన్‌: ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదేశించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2026పై సోమవారం హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ అంకిత్‌ హాజరయ్యారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడారు. ఎన్యుమరేషన్‌ ఫారాలను బీఎల్‌ఓలు మాత్ర మే అందజేయాలని, అనధికార వ్యక్తుల ద్వారా పంపిణీ చేయొద్దని ఆదేశించారు. ఎన్నికల శాఖ సూపరింటెండెంట్‌ రంగ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణిలో కలెక్టర్‌ అంకిత్‌

ములకలపల్లి: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌)లో పొరపాట్లకు తావివ్వొద్దని కలెక్టర్‌ అంకిత్‌ ఆదేశించారు. ములకలపల్లిలో బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ చేస్తున్న తీరును కలెక్టర్‌ సోమవారం తనిఖీ చేశారు. ఫారాల పంపిణీ సందర్భంగా ఓటర్ల సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పారదర్శకతతో నిర్వహించాలని ఆదేశించారు.

వైద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

వర్షాకాలం నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుందని, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ అంకిత్‌ అదేశించారు. ములకలపల్లి పీహెచ్‌సీలో తనిఖీ చేశారు. వార్డులు, ల్యాబ్‌లను పరిశీలించారు. అవసరమైన మందులు, పరీక్షా సామగ్రి అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. తహసీల్దార్‌ స్వాతిబిదు, డీటీ భాగ్యలక్ష్మి, పీహెచ్‌సీ వైద్యాధికారి సాయికల్యాణ్‌, బీఎల్‌ఓలు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement