సహకార సంఘాల బలోపేతానికి కృషి | - | Sakshi
Sakshi News home page

సహకార సంఘాల బలోపేతానికి కృషి

Jun 30 2026 12:54 AM | Updated on Jun 30 2026 12:54 AM

సహకార బ్యాంకులో వడ్డీ తగ్గించాలి

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కల్లూరులో డీసీసీబీ నూతన బ్రాంచ్‌ ప్రారంభం

కల్లూరురూరల్‌: సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం తరఫున కృషి జరుగుతోందని, ఇందుకు రైతులు కూడా సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కల్లూరులో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ నూతన బ్రాంచ్‌ను మంత్రి సోమవారం ప్రారంభించి మాట్లాడారు. రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే బ్యాంకు అభివృద్ధి చెందడమే కాక మరిన్ని రుణాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కల్లూరులో అన్ని కార్యాలయాలు ఒకేచోట కొలువుదీరేలా ఇంటిగ్రేటెడ్‌ కార్యాలయ సముదాయం నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల సాగర్‌ నీరు రాకున్నా, పంటలకు గోదావరి జలాలు సరఫరా చేసేందుకు ప్రయత్నం చేస్తామని మంత్రి తెలిపారు.

కాంగ్రెస్‌ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి

ఓటరు జాబితా సవరణ నేపథ్యాన అర్హుల ఓట్లు తొలగించకుండా కాంగ్రెస్‌ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే రాగమయి సూచించారు. కల్లూరులో ఏర్పాటుచేసిన బీఎల్‌ఏల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పోట్రు అర్జున్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ మోహన్‌నాయక్‌, వైస్‌చైర్మన్‌ శీలం కోటేశ్వరి, నాయకులు పసుమర్తి చందర్‌రావు, అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సహకార సంఘాల్లో రైతులకు ఇస్తున్న రుణాలపై వడ్డీ తగ్గించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయి మంత్రి తుమ్మలను కోరారు. జిల్లా సహకార శాఖ అధికారి గంగాధర్‌ మాట్లాడుతూ రైతుల సహకారంతో డీసీసీబీ రూ.4500 కోట్ల టర్నోవర్‌ సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ కల్లూరు మేనేజర్‌ అనిత, అధికారులు వెంకట్‌, చందర్‌, సర్వేశ్వరరావు, మున్సిపల్‌ చైర్మన్‌ మోహన్‌నాయక్‌, కమిషనర్‌ సాయికృష్ణారెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ భాగం నీరజాదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement