చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్‌రోడ్డు వద్ద రైతుమేళా, రైతు ఆశీర్వాద సభ నిర్వహణకు సిద్ధం చేసిన మైదానం వర్షంతో చిత్తడిగా మారింది. ఏర్పాట్లు చివరి దశకు చేరాక మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో తొలుత రైతుమేళాను రద్దు చేశారు. ఇక మంగళవారం సీఎం పాల్గొనాల్సిన రైతు ఆశీర్వాద సభ అయినా నిర్వహించాలని యంత్రాంగం భావించినా వరుణుడు కరుణ చూపలేదు. ఫలితంగా సభా వేదిక, ప్రాంగణం బురదమయం కాగా, పార్కింగ్ ఏరియాలో నీరు చేరి చెరువును తలపించింది. దీంతో సభను కూడా వాయిదా వేయక తప్పలేదు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్


