ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన చికిత్స | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన చికిత్స

Jun 30 2026 12:54 AM | Updated on Jun 30 2026 12:54 AM

పాల్వంచ: విరిగిన దవడకు పాల్వంచ ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన చికిత్స అందించారు. పాల్వంచ పట్టణ పరిధిలోని దాబానగర్‌కు చెందిన బానోతు కిరణ్‌ సింగ్‌ కుటుంబ కలహాల దాడిలో ఎడమ ముఖ భాగానికి తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి రాగా, పరీక్షంచి దవడ, చెంప ఎముకలు విరిగినట్లు గుర్తించారు. సోమవారం ఓరోమాక్సిలరీ ఫెసియల్‌ సర్జన్‌ డాక్టర్‌ మోహన్‌ వంశీ కృష్ణ, మత్తు వైద్యుడు శంకర్‌ రావు శస్త్ర చికిత్స నిర్వహించారు. నర్సులు రేవతి, జ్యోతి, సిబ్బంది జగదీష్‌ సహకరించారు. దాదాపు రెండు గంటల పాటు క్లిష్టమైన శస్త్ర చికిత్స చేసి విరిగిన ఎముకలను యథాస్థానంలో అమర్చడంతోపాటు దవడలను స్థిరపరిచారు. ప్రస్తుతం కిరణ్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కాగా, శస్త్ర చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రుల్లో సుమారు రూ.70వేల వరకు ఖర్చయ్యేదని వైద్యులు తెలిపారు. వైద్యులను, సిబ్బందిని డీసీహెచ్‌ఎస్‌ రవిబాబు, సూపరింటెండెంట్‌ రాంప్రసాద్‌, డాక్టర్‌ సోమరాజు దొర అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement